రెండేళ్లనాటి కేసులో అర్నాబ్ గోస్వామి అరెస్ట్

రెండేళ్ల నాటి  సూసైడ్ కేసులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును వారు ఇటీవలే రీ ఓపెన్ చేశారు. 2018 లో 53 ఏళ్ళ ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తలి ఆత్మహత్యకు అర్నాబ్ ప్రేరేపించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ముంబైలోని అర్నాబ్  ఇంటిలో బుధవారం ఉదయం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు . తనను బలవంతంగా లాక్కునిపోయి వ్యాన్ లో పడేశారని అర్నాబ్ ఆరోపించారు. పోలీసులు […]

  • Umakanth Rao
  • Publish Date - 10:57 am, Wed, 4 November 20
రెండేళ్లనాటి కేసులో అర్నాబ్ గోస్వామి అరెస్ట్

రెండేళ్ల నాటి  సూసైడ్ కేసులో రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును వారు ఇటీవలే రీ ఓపెన్ చేశారు. 2018 లో 53 ఏళ్ళ ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్, ఆయన తలి ఆత్మహత్యకు అర్నాబ్ ప్రేరేపించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ముంబైలోని అర్నాబ్  ఇంటిలో బుధవారం ఉదయం పోలీసులు ఆయనను అరెస్టు చేశారు . తనను బలవంతంగా లాక్కునిపోయి వ్యాన్ లో పడేశారని అర్నాబ్ ఆరోపించారు. పోలీసులు అర్నాబ్ భార్య, అత్తమామలు, కొడుకు పట్ల కూడా దురుసుగా ప్రవర్తించారని తెలిసింది.

అన్వయ్ నాయక్ కుమారుడు ఆదన్య నాయక్, ఆయన కుమార్తె తాజాగా ఇఛ్చిన ఫిర్యాదుపై ఖాకీలు ఈ కేసును తిరగదోడినట్టు తెలుస్తోంది. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకపోవడం తనను ఆత్మహత్యకు ప్రేరేపించిందని  అన్వయ్ నాయక్ నాడు తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. కాగా-అర్నాబ్ అరెస్టును కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఎమర్జెన్సీ రోజులను ఇది గుర్తుకు తెస్తోందన్నారు.