జేఈఈ అడ్వాన్స్‌డ్‌ : 75% ఇంటర్‌ మార్కుల నిబంధన ఎత్తివేత‌కు అడుగులు..!

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీల్లోని ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో ఎంట్ర‌న్స్ పొందేందుకు ఇంటర్‌, అందుకు సమానమైన ఎగ్జామ్స్ లో కనీసం 75 శాతం మార్కులు తప్పనిసరి అనే రూల్ ఈ ఏడాదికి తీసివేయాల‌ని జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) యోచిస్తోంది.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ : 75% ఇంటర్‌ మార్కుల నిబంధన  ఎత్తివేత‌కు అడుగులు..!
Follow us

|

Updated on: Jul 11, 2020 | 8:41 PM

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ద్వారా ఐఐటీల్లోని ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో ఎంట్ర‌న్స్ పొందేందుకు ఇంటర్‌, అందుకు సమానమైన ఎగ్జామ్స్ లో కనీసం 75 శాతం మార్కులు తప్పనిసరి అనే రూల్ ఈ ఏడాదికి తీసివేయాల‌ని జాయింట్‌ అడ్మిషన్‌ బోర్డు(జేఏబీ) యోచిస్తోంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఫ‌స్ట్ ర్యాంక్ సాధించినా ఇంటర్‌లో 75 ప‌ర్సెంట్ మార్కులు లేదా బోర్డు ఎగ్జామ్స్ మొదటి 20 పర్సంటైల్‌లో లేకుంటే ప్రవేశం పొందటం ఇప్పటివరకు కుదరదు. ఈసారి క‌రోనా సంక్షోభం కారణంగా ఆ రూల్ మినహాయించాలని జేఏబీ సమాలోచ‌న‌లు చేస్తోంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కార్యనిర్వాహక ఛైర్మన్‌ సిద్ధార్థ్‌పాండే వివ‌రించారు.

అయితే దీనిపై నిర్ణయం తీసుకున్నా పెద్దగా ప్రభావం చూపే అవ‌కాశాలు లేవ‌ని అంచ‌నా. ఎందుకంటే అడ్వాన్స్‌డ్‌లో క్వాలిఫై అయిన‌వారు ఐఐటీల్లో సీట్లు పొందిన వారిలో… 75 ప‌ర్సెంట్ మార్కులు పొందని వారు చాలా తక్కువ మంది ఉంటారని లెక్క‌లు వేస్తున్నారు. ఈసారి అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ సెప్టెంబరు 27న జరపాలని ఇటీవల కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. జేఈఈ మెయిన్‌లో క్వాలిఫై అయిన‌ మొత్తం 2.50లక్షల మందికి మాత్రమే ఈ ఎగ్జామ్ రాసేందుకు ఛాన్స్ ఇస్తారు.