కొవిడ్ కట్టడికి రోబో సేవలు… ఈజిప్టు లో ప్రయోగాత్మకంగా అందుబాటులోకి… కరోనా టెస్టులూ చేసేస్తోంది…

ఈజిప్టు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోబో కొవిడ్ రోగులకు సేవలందిస్తోంది. టెంపరేచర్ చెక్ చేసి, కరోనా టెస్టులు కూడా చేస్తోంది. ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ రోబో వైద్యసేవలు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • Rajeev Rayala
  • Publish Date - 8:32 pm, Thu, 26 November 20

ఈజిప్టు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రోబో కొవిడ్ రోగులకు సేవలందిస్తోంది. టెంపరేచర్ చెక్ చేసి, కరోనా టెస్టులు కూడా చేస్తోంది. ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ రోబో వైద్యసేవలు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఎప్పటి నుంచే అందుబాటులో ఉన్నా…

ఆస్పత్రులు, ల్యాబరేటరీల్లో రోబో సేవలను అందుబాటులోకి ఉండడం సర్వసాధారణమే. రోగులను పర్యవేక్షించడం, ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటూ, మెడికల్ వర్కర్స్ కు సాయం చేయడం వంటి అంశాల్లో రోబోల సేవలు మరింత విస్తృతమవుతున్నాయి. తాజాగా సిరా 03 అనో రోబోను రూపొందించిన ఈజిప్షియన్ ఇన్వెంటర్ కోవిడ్ పరీక్షలు చేసేలా డిజైన్ చేశారు.

ఇక ఆస్పత్రిలో ఎవరైనా మాస్కు వేసుకోలేదంటే వారిని గుర్తించి, అటువంటి వారికి వార్నింగ్ కూడా ఇచ్చేలా రూపొందించాడు. బ్లడ్ టెస్ట్, ఎకో కార్డియోగ్రామ్స్, ఎక్-రే, వంటి పరీక్షలు చేసేలా ఈ రోబోను డిజైన్ చేశారు. స్వాబ్ పరీక్షలు చేయటానికి ఈ రోబో సేవలు అత్యద్భుతంగా పనికి వస్తాయని వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. ఈ పరీక్షలు చేసే క్రమంలో వైరస్ కు ఎక్స్ పోజ్ కాకుండా వైద్య సిబ్బందిని కాపాడేందుకు రోబోలే చక్కని ప్రత్యామ్నాయమని తెలుపుతున్నారు.