మరో సంచలనం..జియో నుంచి గిగాఫైబర్ సర్వీసులు!

Reliance Jio, మరో సంచలనం..జియో నుంచి గిగాఫైబర్ సర్వీసులు!

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపుతోంది. జియో గిగాఫైబర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12న జరగనున్న వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో ఈ సేవలను ప్రారంభించనున్నట్టు సమాచారం. ఫైబర్ టు ద హోమ్ (ఎఫ్‌టీటీహెచ్) సాంకేతికతపై పనిచేయనున్న రిలయన్స్ జియో గిగాఫైబర్ ద్వారా అతి తక్కువ ధరకే ఖాతాదారులకు మూడు రకాల సేవలు అందనున్నాయి. అందులో మొదటిది బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులు కాగా, రెండోది ల్యాండ్‌లైన్, మూడోది టీవీ కనెక్షన్.

గత కొన్ని నెలలుగా గిగాఫైబర్ సేవలను పరీక్షిస్తున్న జియో ఇప్పుడు దీనిని అధికారికంగా ప్రారంభించేందుకు రెడీ అయింది. కేవలం 600 రూపాయలకే మూడు రకాల సేవలు జియో గిగా‌ఫైబర్ ద్వారా లభించనున్నాయి. ఇందులో 1జీబీ వేగంతో బ్రాడ్‌బ్యాండ్ సేవలు, 600 టీవీ చానళ్లు, ల్యాండ్‌లైన్ కనెక్షన్ లభిస్తాయి. ఇందులో ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ ఆప్షన్లు కూడా ఉండనున్నాయి. అయితే, ఓఎన్‌టీ డివైజ్ (గిగాహబ్ హోం గేట్‌వే) కోసం సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. ఒకసారి ఈ సేవలు వద్దనుకుంటే డిపాజిట్ చేసిన రూ.2500లను వెనక్కి ఇచ్చేస్తారు. ఓఎన్‌టీ డివైజ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు రౌటర్‌లా పనిచేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *