జియో గిగా ఫైబర్‌: ఇప్పటికే 15 లక్షల రిజిస్ట్రేషన్లు..!

టెలికాం రంగంలోనే జియో నెట్‌వర్క్ సంచలనం సృష్టించింది. అత్యంత చౌక ధరలతో జియో నెట్‌వర్క్‌ని విడుదల చేసి దేశవ్యాప్తంగా ఆహా.. అనిపించారు ముఖేష్ అంబానీ. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి జియో గిగా ఫైబర్‌ను ప్రవేశపెట్టనున్నారు. వీటికోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీటిని సెప్టంబర్ 5న విడుదల చేయనున్నారని అంటున్నారు. అయితే.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే.. జియో గిగా ఫైబర్‌ కోసం 15 లక్షల మంది రిజిస్ట్రేషన్లు వచ్చాయని జియో నిర్వాహకులు […]

జియో గిగా ఫైబర్‌: ఇప్పటికే 15 లక్షల రిజిస్ట్రేషన్లు..!
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2019 | 5:34 PM

టెలికాం రంగంలోనే జియో నెట్‌వర్క్ సంచలనం సృష్టించింది. అత్యంత చౌక ధరలతో జియో నెట్‌వర్క్‌ని విడుదల చేసి దేశవ్యాప్తంగా ఆహా.. అనిపించారు ముఖేష్ అంబానీ. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి జియో గిగా ఫైబర్‌ను ప్రవేశపెట్టనున్నారు. వీటికోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీటిని సెప్టంబర్ 5న విడుదల చేయనున్నారని అంటున్నారు. అయితే.. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇప్పటికే.. జియో గిగా ఫైబర్‌ కోసం 15 లక్షల మంది రిజిస్ట్రేషన్లు వచ్చాయని జియో నిర్వాహకులు తెలిపారు. అంతేగాక.. వీటిని రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ల్యాండ్ లైన్లు, 4కే సెట్ టాప్ బ్యాక్సులు, 4కే టీవీలు కూడా ఉచితంగా ఇస్తామని ముఖేష్ అంబాని తెలిపారు. అయితే.. ఈ ప్లాన్‌కు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు. జియో గిగాఫైబర్ ప్యాకేజీలు.. రూ.700 నుంచి ప్రారంభమై.. దాదాపు రూ.10 వేల వరకూ ఉన్నాయి. నెట్ స్పీడ్.. ప్లాన్‌ ఎంచుకున్న దానిబట్టి కనిష్టంగా 100 ఎంబీపీఎస్ నుంచి గరిష్టంగా 1 జీవీపీఎస్ వరకు ఆఫర్లు ఉన్నాయి.

కాగా.. జియో గిగాఫైబర్‌తో రిలీజైన రోజే సినిమా చూడొచ్చని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. లేటెస్ట్ టెక్నాలజీతో.. ఇప్పుడు ఏదైనా సాధ్యమవుతోంది. అలాంటి టెక్నాలజీ జియో గిగాఫైబర్‌లో ఉందని.. ‘సినిమా’ రిలీజైన రోజే.. ఇంట్లో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చని అంటున్నారు. ముంబైలో జరిగిన రిలయన్స్ 42వ వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. ఏ సినిమా ఎప్పుడు రిలీజైనా.. దాని టీవీలో చూడొచ్చని అంటున్నారు. అయితే.. అది కేవలం తమ ప్రీమియం కస్టమర్లకు మాత్రమే ఈ అవకాశం లభిస్తుందని చెప్పారు. అంతేకాకుండా నెట్‌ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్, హాట్ స్టార్, జీ5, వంటి ఓటీటీ సేవలను విడివిడిగా కొనే అవసరం లేకుండా తమ ప్యాక్స్‌ల్లోనే ఉచితంగా అందిస్తామని ముఖే అంబానీ తెలిపారు.

జియో గిగా ఫీచర్స్:

1. రిలయన్స్ జియోని 5జీగా అప్‌గ్రేడ్ 2. 1600 పట్టణాల్లో 20 మిలియన్ల మందికి బ్యాడ్‌బ్యాండ్ కనెక్షన్లు 3. హోం బ్రాడ్ బ్యాండ్, 100జీబీ ఇంటర్నెట్, యూహెచ్‌డీ సెటాప్‌బాక్స్ 4. ఒకే కనెక్షన్‌తో ఇంటర్నెట్, డీటీహెచ్, ల్యాండ్‌లైన్ సర్వీసులు 5. రిలయన్స్ జియో ఫోన్‌ 3 పేరుతో కొత్త ఫీచర్ ఫోన్ లాంచ్ 6. నాలుగు రకాల బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు

Reliance Jio Fiber to launch on Sept