Breaking News
  • ఖమ్మం డీసీసీబీ చైర్మన్‌గా నాగభూషయ్య . ఖమ్మం వైస్‌ చైర్మన్‌గా దొండపాటి వెంకటేశ్వరరావు. ఖమ్మం డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రాయల శేషగిరిరావు. డీసీఎంఎస్‌ వైస్‌ చైర్మన్‌గా కొత్వాల శ్రీనివాసరావు ఎన్నిక.
  • మహబూబ్‌నగర్‌ డీసీసీబీ చైర్మన్‌గా నిజాంపాషా.. వైస్‌ చైర్మన్‌గా కొర్రమొని వెంకటయ్య. మహబూబ్‌నగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌గా ప్రభాకర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా హర్యానాయక్‌ ఎన్నిక.
  • మెదక్‌ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్‌రెడ్డి ఎన్నిక. వైస్‌ చైర్మన్‌గా పట్నం మాణిక్యం. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా శివకుమార్‌ .
  • నల్గొండ డీసీసీబీ చైర్మన్‌గా గొంగిడి మహేందర్‌రెడ్డి. వైస్‌ చైర్మన్‌గా ఏసిరెడ్డి దయాక్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా వట్టె జానయ్య. వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి.
  • వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు.. వైస్‌ చైర్మన్‌గా కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి. డీసీఎంఎస్‌ చైర్మన్‌గా రామస్వామినాయక్‌ వైస్‌ చైర్మన్‌గా దేశిని శ్రీనివాస్‌రెడ్డి.

అమర జవాన్ల కుటుంబాల బాధ్యత మేముతీసుకుంటాం : రిలయన్స్ ఫౌండేషన్

, అమర జవాన్ల కుటుంబాల బాధ్యత మేముతీసుకుంటాం : రిలయన్స్ ఫౌండేషన్

రిలయన్స్ ఫౌండేషన్.. ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ అండగా ఉండే సంస్థ. అలాంటి సంస్థ ఇప్పుడు తన బాధ్యతగా మరోసారి ముందుకొచ్చింది. ఈసారి పుల్వామా బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సిద్ధమైంది. పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబాల బాధ్యత తీసుకుంటామని ప్రకటించింది. అమరుల కుటుంబంలోని పిల్లల చదువులు, వారి ఉద్యోగ బాధ్యతలు మేము తీసుకుంటామని హామీ ఇచ్చింది. వారి జీవనోపాధికి అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చింది. ఇంతటితోనే తాము ఆగిపోబోమని, రిలయన్స్ ఫౌండేషన్ సహకారం ఎక్కడ అవసరం అని ప్రభుత్వం భావిస్తే, తాము అక్కడ సంపూర్ణంగా మద్దతు ఇస్తామని ప్రకటించింది., అమర జవాన్ల కుటుంబాల బాధ్యత మేముతీసుకుంటాం : రిలయన్స్ ఫౌండేషన్

 

 

సైన్యానికి, ప్రభుత్వానికి తమ సాయం అవసరమైనప్పుడు వారికి సహకారం అందిస్తామని ప్రకటించింది. గాయపడిన జవాన్లకు తమ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

Related Tags