కరోనా మృతురాలి బ్యాగ్ తెరిచినందుకు.. 18 మందికి పాజిటివ్..!

కరోనా మృతురాలి బ్యాగ్ తెరిచినందుకు 18 మందికి కరోనా సోకింది. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కరోనా లక్షణాలతో 40 ఏళ్ల మహిళ ఇటీవల మరణించింది. పరీక్షల నిమిత్తం మృతురాలి నమూనాలను తీసుకున్న వైద్యులు.. ఆమె మృతదేహాన్ని ప్యాక్‌ చేసి బంధువులకు అందించారు. దాన్ని తెరవకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను పట్టించుకోని మృతురాలి బంధువులు ప్యాక్ చేసిన బ్యాగ్‌ను తెరిచి మృతదేహాన్ని తాకి అంత్యక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో […]

కరోనా మృతురాలి బ్యాగ్ తెరిచినందుకు.. 18 మందికి పాజిటివ్..!
Follow us

| Edited By:

Updated on: May 30, 2020 | 12:16 PM

కరోనా మృతురాలి బ్యాగ్ తెరిచినందుకు 18 మందికి కరోనా సోకింది. మహారాష్ట్రలోని థానేలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కరోనా లక్షణాలతో 40 ఏళ్ల మహిళ ఇటీవల మరణించింది. పరీక్షల నిమిత్తం మృతురాలి నమూనాలను తీసుకున్న వైద్యులు.. ఆమె మృతదేహాన్ని ప్యాక్‌ చేసి బంధువులకు అందించారు. దాన్ని తెరవకుండానే అంత్యక్రియలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఆదేశాలను పట్టించుకోని మృతురాలి బంధువులు ప్యాక్ చేసిన బ్యాగ్‌ను తెరిచి మృతదేహాన్ని తాకి అంత్యక్రియలు చేశారు.

ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పాల్గొన్నారు. ఆ తరువాత వచ్చిన మృతురాలికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఫలితాల్లో తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంత్యక్రియల్లో పాల్గొన్న 50 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. అందులో 18 మందికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో మిగిలిన వారిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై స్పందించిన ఉల్లాస్‌నగర్ మున్సిపల్ శాఖ సీనియర్ అధికారి.. సంబంధిత బంధువులపై పోలీస్‌ కేసు నమోదు చేస్తామని అన్నారు.

Read This Story Also: ఇంగ్లండ్‌లో భారత సంతతి వైద్యుడు అనుమానాస్పద మృతి..!