బాలింత‌కు క‌రోనా..ఆస్ప‌త్రి నుంచి ప‌రార్‌..ఆందోళ‌న‌లో వైద్యులు, సిబ్బంది

హైద‌రాబాద్‌లో ఓ బాలింత‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధారించిన వైద్యులు... ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌లోనే ఆమె బంధువులు త‌ల్లీబిడ్డ‌ను తీసుకుని అక్క‌డ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న..

బాలింత‌కు క‌రోనా..ఆస్ప‌త్రి నుంచి ప‌రార్‌..ఆందోళ‌న‌లో వైద్యులు, సిబ్బంది
Follow us

|

Updated on: Jun 16, 2020 | 9:18 PM

హైద‌రాబాద్‌లో ఓ బాలింత‌కు క‌రోనా వైర‌స్ సోకిన‌ట్లు నిర్ధారించిన వైద్యులు… ఆమెను సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్ప‌త్రికి త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. ఇంత‌లోనే ఆమె బంధువులు త‌ల్లీబిడ్డ‌ను తీసుకుని అక్క‌డ్నుంచి వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న పాతబస్తీలోని బేలా సూరజ్భాన్ ఆస్ప‌త్రిలో చోటుచేసుకుంది. ఈ సంఘ‌ట‌న  స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది.
హైదరాబాద్ లోని హఫీజ్ బాబానగర్ కు చెందిన ఓమహిళ ఈ నెల 8న పాతబస్తీలోని బేలా సూరజ్భాన్ ఆస్ప‌త్రిలో చేరింది. కాగా, ఆ మ‌ర్నాడు డాక్ట‌ర్లు ఆమెకు సిజేరియన్ చేయగా బాబు పుట్టాడు. అయితే నాలుగు రోజుల కింద ఆమెకు దగ్గు, జలుబు మొదలైంది. దీంతో అనుమానం వ‌చ్చిన వైద్యులు ఆమెను వేరే రూముకు షిఫ్టు చేసి శాంపిల్స్ సేకరించి కరోనా టెస్టులకు పంపారు. సోమవారం రిజల్ట్ లో వైరస్ పాజిటివ్ వచ్చింది. దాంతో గాంధీ హాస్పిటల్ కు పంపాలని డాక్ట‌ర్లు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు చెప్పారు. కానీ డాక్ట‌ర్లు తప్పుగా చెప్తున్నారంటూ వాళ్లంతా గొడవకు దిగారు. దీనిపై ఆస్ప‌త్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.
అయితే, పోలీసులు అక్క‌డ‌కు వచ్చేలోపేకుటుంబ సభ్యులు ఆ బాలింతను, బాబును తీసుకుని వెళ్లి పోయారు. పోలీసులు వాళ్ల‌ను వెతికే పనిలో పడ్డారు. అయితే ఆ మహిళకు ట్రీట్మెంట్ చేసిన ఐదుగురు డాక్ట‌ర్లు, ఐదుగురు నర్సు ల్లో ఆందోళన మొదలైంది. వారందరి నుంచి శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపారు. కరోనా పాజిటివ్ అని తేలిన బాలింతకు చికిత్స అందించిన వార్డులోనే మరో పది మంది బాలింతలు ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..