Breaking News
  • హైదరాబాద్‌: గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ దాష్టీకం. విద్యార్థిని నేలకేసి కొట్టిన ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణ్యం. ప్రిన్సిపాల్‌ను నిలదీసిన విద్యార్థి తల్లిదండ్రులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండని దురుసుప్రవర్తన. ప్రిన్సిపాల్‌ సుబ్రహ్మణం కులంపేరుతో దూషిస్తూ.. చితకబాదుతున్నాడని కన్నీళ్లు పెట్టుకున్న విద్యార్థులు.
  • ఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్జీటీలో విచారణ. విచారణకు హాజరుకాని తెలంగాణ పీసీబీ అధికారులు . తదుపరి విచారణ ఫిబ్రవరి 10కి వాయిదా . పర్యావరణ అనుమతుల విషయంలో పీసీబీ అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న పిటిషనర్‌ హయాతుద్దీన్‌.
  • ఢిల్లీ: 2020-21 వార్షిక బడ్జెట్‌ ప్రతుల ముద్రణ ప్రారంభం. ఆర్థికశాఖ కార్యాలయం నార్త్‌బ్లాక్‌లో హల్వా వేడుక. బడ్జెట్‌ ప్రతుల ముద్రణ సందర్భంగా హల్వా వేడుక ఆనవాయితీ. హాజరైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థికశాఖ కార్యదర్శులు.
  • ప.గో: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని బీజేపీ నినాదం-మాణిక్యాలరావు. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గురించి టీడీపీ మాట్లాడుతోంది. ఐదు కోట్ల ఆంధ్రుల తరపున బీజేపీ-జనసేన పోరాడుతుంది. రాష్ట్రంలో జగన్ పాలన తుగ్లక్ పాలనను గుర్తుచేస్తోంది-మాణిక్యాలరావు.
  • సిద్దిపేట: గజ్వేల్‌లో మంత్రి హరీష్‌రావు ఎన్నికల ప్రచారం. ఈ ఎన్నికల్లో ఉత్తమ్‌ మాటలన్నీ ఉత్తర ప్రగల్బాలే అని తేలిపోనుంది. 2 వేల వార్డులు గెలుస్తామంటున్న బీజేపీకి.. గజ్వేల్‌లోని 20 వార్డుల్లో ఏ ఒక్క వార్డు గెలవలేరు-హరీష్‌రావు. 20 వార్డులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి-హరీష్‌రావు.

పచ్చ చీర బ్యూటీ..బిగ్ బాస్ మీదే దృష్టి

, పచ్చ చీర బ్యూటీ..బిగ్ బాస్ మీదే దృష్టి
లక్నో పోలింగ్ కేంద్రంలో పసుపు పచ్చని చీరతో మెరిసిపోతూ..చేతిలో ఈ వీ ఎం పట్టుకుని వయ్యారంగా నడుస్తూ వచ్చిన అందాల అధికారిణి రీనా ద్వివేది ఓవర్ నైట్ లో ఇంటర్నెట్ సెన్సేషన్ అయిపోయింది..ఆ బ్యూటీ గురించి మాట్లాడుకోని వాళ్ళు లేరు..ఎవరామె ? పోలింగ్ కేంద్రానికి ఇంత అప్సరస లాంటి వ్యక్తి రావడమేమిటంటూ అంతా కళ్ళప్పగించి ఆమెను చూశారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఈమెకు రియాల్టీ షో..బిగ్ బాస్-13 సీజన్ లో పార్టిసిపేట్ చేయాలని ఉందట.. తనకు ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చిందని, అయితే ఇలాంటి షో లలో పాల్గొంటే మరింత పాపులర్ అవుతానని రీనా ద్వివేదీ అంటోంది. తనకు మంచి చీరలు, డ్రెస్సులంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ స్టయిల్ గా ఉండాలని అనుకుంటానని తెలిపింది. పోలింగ్ విధుల్లో గానీ,,ఆఫీసర్ గా ఆఫీసులో డ్యూటీ చేస్తున్నప్పుడు గానీ తన అందాలకే ప్రాధాన్యమిస్తానని ఈ భామ చెప్పింది. అన్నట్టు..ఈమెకు తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడట.. కానీ చాలామంది ఈ విషయాన్ని నమ్మడంలేదు.
, పచ్చ చీర బ్యూటీ..బిగ్ బాస్ మీదే దృష్టి