Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

‘వైకుంఠపురం’ ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?

Ala Vaikuntapuram Lo Movie Updates, ‘వైకుంఠపురం’ ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘అల..వైకుంఠపురములో’. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎక్కువగా భాగం ‘వైకుంఠపురం’ అనే హౌస్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ఇక రీల్‌లో ఉన్న ఆ హౌస్‌ రియల్‌లో ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం.!

తెలుగులో పాపులర్ న్యూస్ ఛానల్‌తో పాటుగా ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ నడుపుతున్న ఓ మీడియా సంస్థ అధినేత కూతురు సొంత ఇల్లు అని ఫిలింనగర్ టాక్. అంతేకాకుండా ఈ ఇంటి విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటైన దీనిపై అల్లు అర్జున్ ఎప్పుడో మనసు పారేసుకున్నాడట. ఇంటీరియర్ డిజైనింగ్ చూసి ముచ్చట పడిన బన్నీ.. అలాంటి ఇంటిని ఒకటి నిర్మించే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ మార్క్‌కు తగ్గట్టు.. ఈ ఇంటి రిచ్‌నెస్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోవడం ఖాయం.

Related Tags