కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తోందా.. అయితే ఇలా చేయండి..!

Reducing 'Ugly Cholesterol' May Help Prevent Stroke: Home Remedies To Manage Cholesterol Levels, కొలెస్ట్రాల్ సమస్య వేధిస్తోందా.. అయితే ఇలా చేయండి..!

మనం అనుసరించే జీవవ విధానమే మన ఆరోగ్యాన్నికి నిరదర్శనంగా నిలుస్తుంది. ఆధునిక కాలంలో ఆహారంతోనే అనేక జబ్బులను కొని తెచ్చుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇది ప్రస్తుతం సర్వసాధరణంగా మారిపోయింది. ముఖ్యంగా గుండె జబ్బులతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. హృదయ సంబంధ వ్యాధులకు ప్రధానంగా ఆహార పదార్ధాలతోపాటు ఊబకాయం కూడా కారణమే.  ఈ సమస్య కారణంగా పక్షవాతం కూడా వచ్చే ప్రమాదం ఉంది. అయితే దీనికి కారణమైన కొలెస్ట్రాల్‌ గురించి తెలుసుకుందాం. అసలు   గుండెకు హాని చేసేది చెడ్డ కొలెస్ట్రాల్. దీనినే ఎల్‌డిఎల్‌ కొలెస్ట్రాల్‌ అని పిలుస్తారు. రెండవది  హెడీఎల్ కొలెస్ట్రాల్ ఇది మంచి కొలెస్ట్రాల్.

ఎల్‌డిఎల్‌ :
. శరీరంలో కొవ్వు పెరగడంలో ఎల్‌డిఎల్‌ది ప్రధాన బాధ్యత. ప్రతీ 1 మిల్లీ గ్రాము/డిఎల్‌ ఎల్‌డిఎల్‌ పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుంది. అయితే ఎల్‌డి ఎల్‌కు ‘సాధరణ స్థాయి’ అంటూ ఏమీ లేదు. ఎల్‌డిఎల్‌ స్థాయి 100 మిల్లీ గ్రాము/డిఎల్‌కు పెరిగినప్పుడు గుండె పోటు ప్రమాదం అధికమవుతుంది. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారిలో ఎల్‌డిఎల్‌ స్థాయి 70 మిల్లీ గ్రాము/డిఎల్‌ కంటే తక్కువ ఉండాలని తాజా పరిశోధనలు సూచి స్తున్నాయి.

హెడీఎల్ :
హెడీఎల్ కొలెస్ట్రాల్ దీనినే మంచి కొలెస్ట్రాల్‌ అని అంటారు. హెచ్‌డిఎల్‌ రక్తనాళాల్లోని కొలెస్ట్రాల్‌ను తొలగించి, కాలేయానికి పంపిస్తుంది. ఇక్కడ కొలెస్ట్రాల్‌ విచ్ఛిన్నం అవుతుంది. ‘అథిరొస్ల్కెరొసిన్‌’ అనే సమస్య ఉత్పన్నం కాకుండా హెచ్‌డిఎల్‌ రక్షణగా ఉంటుంది. హెచ్‌డిఎల్‌ స్థాయి తక్కువగా ఉందంటే, గుండె రక్తనాళాల వ్యాధి ప్రమాదం పెరుగుతున్నట్లు భావించాలి. గుండె పోటుకు బలమైన కారణం ఎల్‌డిఎల్‌ పెరగడం కన్నా హెచ్‌డిఎల్‌ తగ్గడమే. హెచ్‌డిఎల్‌ పురు షుల్లో 40 ఎంజి/ డిఎల్‌, మహిళల్లో 50 ఎంజి/డిఎల్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఈ చిట్కాలు పాటిస్తే మంచిది..

అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ ఎల్‌డీఎల్‌ను తగ్గించడంతో పాటు హెచ్‌డీఎల్‌ను స్ధాయిని కూడా పెంచుకునే వీలుంది. ఇక దనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మంచిది. ఇక మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. వీటిని నేరుగా తినలేము. ఎందుకంటే ఇవి రుచికి చిరు చేదుగా అనిపిస్తాయి. అందువల్ల నానబెట్టుకుని తింటే మంచిది. ఇక చివరిగా ఉసిరి ఇది ఆయుర్వేదంలో ప్రముఖంగా చెప్పబడింది. ఇది కొలెస్ట్రాల్ సమస్యకు చక్కని పరిష్కారంగా నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏదైనా సమస్య రాకముందే ఇలాంటివి అలవాటు చేసుకుంటే మంచిదని.. చక్కని ఆరోగ్యాన్ని పొందవచ్చని కూడా చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *