తీగ లాగితే ఎర్ర చందనం డంక కదిలింది…రాష్ట్ర సరిహద్దులే కాదు..దేశం సరిహద్దులు దాటిస్తున్న రెడ్ స్మగ్లర్లు ఎవరో తెలుసా..

మొన్న బాషా ఇవాళ ఖలీల్‌, అఫ్రోజ్ ....పేర్లేమైనా... వీళ్ల దందా అంతా ఒకటే ఏపీలోని ఎర్రచందనం దుంగల్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి విదేశాలకు తరలించడం. ఈ మాస్టర్ ప్లాన్‌నే పసిగట్టారు కడప జిల్లా పోలీసులు. ఒకటి రెండు కాదు... సుమారు వంద ఎర్రచందనం దుంగల్ని..

తీగ లాగితే ఎర్ర చందనం డంక కదిలింది...రాష్ట్ర సరిహద్దులే కాదు..దేశం సరిహద్దులు దాటిస్తున్న రెడ్ స్మగ్లర్లు ఎవరో తెలుసా..
Follow us

|

Updated on: Dec 02, 2020 | 7:05 PM

SandalWood Smuggling : ఆంధ్ర రాష్ట్రంలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌ జరుగుతున్న తీరు చూస్తుంటే అధికారులకు మతి పోతోంది. తీగ లాగితే డొంక కదిలినట్లుగా ఒక్కరిద్దరు కాదు ఇందులో అంతర్‌ రాష్ట్ర దొంగలు, పేరు మోసిన క్రిమినల్స్‌, రౌడీషీటర్స్‌ ఇన్వాల్వ్‌ మెంట్ ఉందని అధికారులు తేల్చారు. కేవలం శేషాచలం అడవులకే పరిమితమైన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఇప్పుడు సీమలో కూడా జోరుగా జరుగుతోంది.

మొన్న బాషా ఇవాళ ఖలీల్‌, అఫ్రోజ్ ….పేర్లేమైనా… వీళ్ల దందా అంతా ఒకటే ఏపీలోని ఎర్రచందనం దుంగల్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి విదేశాలకు తరలించడం. ఈ మాస్టర్ ప్లాన్‌నే పసిగట్టారు కడప జిల్లా పోలీసులు. ఒకటి రెండు కాదు… సుమారు వంద ఎర్రచందనం దుంగల్ని పట్టుకున్నారు. మైదుకూరు, రాజంపేట నియోజకవర్గంలో 30మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. రెడ్ స్మగ్లర్ల నుంచి 5 వాహనాలు ,4 టన్నుల బరువైన 98 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు పట్టుకున్న ఎర్రచందనం దుంగల విలువ అక్షరాల మూడు కోట్లు.

కడప జిల్లా రాజంపేట, మైదుకూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఎప్పటి నుంచో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే సిద్దవటం దగ్గర దొరికిన ఐదుగుర్ని విచారించగా మిగిలిన నేరస్తుల పేర్లు బయటపడ్డాయి. కడప పోలీసులు పట్టుకున్న 30మందిలో 28 మంది కడపజిల్లా కి చెందిన వారిగా గుర్తించారు. ఇద్దరు స్మగ్లర్లు కర్ణాటక రాష్ట్రంలోని కటిగినహళ్లి ప్రాంతానికి చెందిన ఖలీల్ ఖాన్, అప్రోజె ఖాన్‌గా గుర్తించారు. పట్టుబడ్డ ఇద్దరు స్మగ్లర్లు అఫ్రోజ్ ఖాన్ , ఖలీల్ ఖాన్ ఎర్ర చందనం దుంగలను ఫయాజ్ ఖాన్ , నస్రుల్లా ఖాన్ అనే మరో ఇద్దరికి అప్పగించేలా అగ్రిమెంట్‌ కుదుర్చుకున్నారు. రెడ్ శ్యాండిల్ దుంగల్ని బొంబై , చెన్నై హార్బర్ ద్వారా విదేశాలకు అక్రమంగా రవాణా జరుగుతోందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఒక చైన్‌ సిస్టమ్‌ మాదిరిగా జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రమేయమున్న నేరస్తుల్ని వదలమని పోలీసులు చెబుతున్నారు. నిందితుల్లో రైల్వే కోడూరుకి చెందిన షేక్ మస్తాన్ రెండు క్రూరమైన హత్య కేసులలో ,ఒక హత్య యత్నం కేసులో అరెస్ట్ అయ్యి ఉన్నాడని జిల్లా ఎస్పీ అన్బు రాజన్‌ తెలిపారు. మిగిలిన వాళ్ల నేర చరిత్ర పై విచారణ జరుపుతున్నామన్నారు. ఎర్రచందనం దుంగలు అక్తమ రవాణా జరిగే విషయం పోలీసులకు సామాన్య ప్రజలు సమాచారమివ్వాలని కోరుతున్నారు. అక్రమ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప జిల్లా ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు.

మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
మహిళ తలలోకి ప్రవేశించిన మెదడు తినే పురుగు.. వైద్యులే షాక్
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
వైరల్‌గా మారిన సహజనటి ఫోటో.. గుర్తుపట్టారా..?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. 2 నెలల్లో ఎంత పెరిగాయో తెలుసా?
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
కుజ, గురు మధ్య రాశి పరివర్తన.. ఆ రాశుల వారికి భాగ్యయోగం, రాజయోగం
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
ముంబైతో మ్యాచ్.. టాస్ గెలిచిన పంజాబ్..జట్టులోకి విధ్వంసకర బ్యాటర్
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
కుంభ రాశిలో రెండు గ్రహాల కలయిక.. ఆ రాశుల వారికి ఉద్యోగ యోగం పక్కా
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
99లకే మల్టీప్లెక్స్ మూవీ టికెట్.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడంటే?
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
రాయి తంత్రం ఎవరిది? కాపు మంత్రం ఫలిస్తుందా? ఏపీలో పొలిటికల్ హీట్
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?