సూర్యుడి భగభగ ! తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి !

తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లో సూర్యుడి భగభగలు మరో నాలుగైదు రోజులు కొనసాగనున్నాయి. నిప్పుల కొలిమిలా ఎండలు దంచి కొట్టనున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణాలో 46 నుంచి 47 లేదా 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్ఛునని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 28 తరువాతే తేలికపాటి వర్షాల కారణంగా వాతావరణం కొంత చల్లబడవచ్చునని నేషనల్ వెదర్ ఫోర్ కాస్టింగ్ హెడ్ నరేష్ కుమార్ తెలిపారు. తెలంగాణతో బాటు పంజాబ్, హర్యానా, చండీ గఢ్, […]

సూర్యుడి భగభగ ! తెలంగాణ సహా 8 రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 25, 2020 | 10:55 AM

తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లో సూర్యుడి భగభగలు మరో నాలుగైదు రోజులు కొనసాగనున్నాయి. నిప్పుల కొలిమిలా ఎండలు దంచి కొట్టనున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, తెలంగాణాలో 46 నుంచి 47 లేదా 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్ఛునని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 28 తరువాతే తేలికపాటి వర్షాల కారణంగా వాతావరణం కొంత చల్లబడవచ్చునని నేషనల్ వెదర్ ఫోర్ కాస్టింగ్ హెడ్ నరేష్ కుమార్ తెలిపారు. తెలంగాణతో బాటు పంజాబ్, హర్యానా, చండీ గఢ్, ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, విదర్భ లలో ఈ నాలుగైదు  రోజుల్లో  వేడిగాలులతో కూడిన వడగాడ్పులు వీయవచ్చునని, ముఖ్యంగా వృధ్ధులు, పిల్లలు, మహిళలు బయటకు రాకుండా ఉండడమే మంచిదని ఆయన సూచించారు. ఈ వేసవిలో వాతావరణ శాఖ ‘రెడ్ వార్నింగ్’ జారీ చేయడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో లక్షలాది వలస కార్మికులు తమ స్వస్థలాలకు తరలుతున్న వేళ ఎండలు ఇలా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

గత ఏడాది 23 రాష్ట్రాల్లో 50 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా వడగాడ్పులకు గురై అనేకమంది మృతి చెందారు. ఈ వారం మధ్యవరకు ఛత్తీస్ గఢ్, ఒడిశా, గుజరాత్, సెంట్రల్ మహారాష్ట్ర, కోస్తా ఆంధ్ర, యానాం. రాయలసీమ, కర్ణాటకలో కొన్ని ఉత్తర ప్రాంతాలు హీట్ వేవ్ తో అల్లాడవచ్ఛునని వాతావరణ శాఖ పేర్కొంది.