తమిళనాడులో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్!

తమిళనాడులో గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అధికారులు ఆదివారం ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు, రాబోయే రెండు రోజుల్లో చెన్నైలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆదివారం ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై జిల్లా యంత్రాంగం పాఠశాలలు మరియు కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెంగల్పట్టు, తిరువళ్లూరు, రామనాథపురం, తూత్తుకుడి, […]

తమిళనాడులో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్!
Follow us

| Edited By:

Updated on: Dec 02, 2019 | 2:10 AM

తమిళనాడులో గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అధికారులు ఆదివారం ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు, రాబోయే రెండు రోజుల్లో చెన్నైలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆదివారం ఉదయం నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై జిల్లా యంత్రాంగం పాఠశాలలు మరియు కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. తమిళనాడు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెంగల్పట్టు, తిరువళ్లూరు, రామనాథపురం, తూత్తుకుడి, కడలూరులలో కూడా పాఠశాలలు మూసివేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

చెన్నైతో పాటు, తిరువళ్లూరు, వెల్లూరు, తిరువణ్ణామలై, తూత్తుకుడి, రామనాథపురం మరియు తిరునల్వేలిలలో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. చెన్నై కార్పొరేషన్ ఫిర్యాదులకోసం హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. 600 పైగా నీటి పంపులు, ఆరు చెట్లను నరికివేసే యంత్రాలను సిద్ధంగా ఉంచారు. అదనంగా నగరం అంతటా 176 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి.. 109 బోట్లు కూడా సిద్ధం చేశారు. అవసరమైతే నిరుపేదలకు ఆహారాన్ని తయారు చేయడానికి కమ్యూనిటీ కిచెన్లను కూడా ఏర్పాటు చేశారు.

[svt-event date=”01/12/2019,11:15PM” class=”svt-cd-green” ]

[/svt-event]