యోగీ ఫార్ములాను ఎంచుకున్న రైల్వే.. ఇక వారందరికి మూడినట్లే..!

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాలలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వెస్ట్ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో దుండగులు.. రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా.. పలు రైళ్లకు కూడా నిప్పుపెట్టారు. ఈ ఘటనల్లో రైల్వే శాఖ పెద్ద ఎత్తున నష్టపోయింది. దాదాపు రూ.80 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించిందని.. రైల్వే బోర్డు […]

యోగీ ఫార్ములాను ఎంచుకున్న రైల్వే.. ఇక వారందరికి మూడినట్లే..!
Follow us

| Edited By:

Updated on: Dec 31, 2019 | 5:44 AM

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, అసోం రాష్ట్రాలలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. వెస్ట్ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో దుండగులు.. రైల్వే స్టేషన్లకు నిప్పు పెట్టారు. అంతేకాకుండా.. పలు రైళ్లకు కూడా నిప్పుపెట్టారు. ఈ ఘటనల్లో రైల్వే శాఖ పెద్ద ఎత్తున నష్టపోయింది. దాదాపు రూ.80 కోట్లకు పైగా ఆస్తినష్టం సంభవించిందని.. రైల్వే బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకు రైల్వే శాఖ కూడా యూపీ సీఎం యోగీ రూట్‌ను ఎంచుకుంది. రైల్వే ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తించి..వారి నుంచే ఆ మొత్తం వసూలు చేస్తామని ప్రకటించింది.

ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లింది. దీంతో యోగీ సర్కార్ కఠిన నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. ఆస్తులను ధ్వంసం చేసిన వారిని గుర్తిస్తూ.. వారి ఆస్తులను జప్తు చేస్తున్నారు. అందుకు వారికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పటికే 498 మందిని గుర్తించి నోటీసులు అందజేశారు. వారి ఆస్తులను వేలం వేసి.. జరిగిన నష్టాన్ని పూడుస్తామని సీఎం యోగి ప్రకటించారు. అయితే ఇప్పుడు రైల్వే బోర్డు కూడా ఇదే మార్గాన్ని ఎంచుకోవడం ఆసక్తిగా మారింది.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన