Breaking News
  • హైదరాబాద్‌: మంగళహాట్‌లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు. డ్రగ్స్ విక్రయిస్తున్న సూరజ్‌సింగ్‌, లలిత్‌కుమార్‌ అరెస్ట్ . నిషేధిత చరాస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. 10 గ్రాములు రూ.18 వేలకు అమ్ముతున్నట్టు తెలిపిన పోలీసులు .
  • మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం . ఆగ్నేయ బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తువరకు కొనసాగుతున్న ఆవర్తనం. రాగల మూడు రోజులు పొడివాతావరణ-హైదరాబాద్ వాతావరణ కేంద్రం . రేపటి నుంచి నైరుతీ రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో.. ఈశాన్య రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం. -హైదరాబాద్ వాతావరణ కేంద్రం .
  • సిద్దిపేట: ఓట్ల కోసం బీజేపీ నేతలు తంటాలు పడుతున్నారు. హైడ్రామాతో ఓట్లు సంపాధించాలని చూస్తున్నారు- పద్మాదేవేందర్‌రెడ్డి. దుబ్బాక ప్రజలు చైతన్య వంతులు- ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ . ఎన్నికల సమయంలో అధికారులు సోదాలు చేయడం సహజం. దుబ్బాకలో టీఆర్‌ఎస్ విజయం ఖాయం- ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి.
  • విజయనగరం: పైడితల్లి అమ్మవారి పండుగలో రాజుల మధ్య వివాదం. సుధ గజపతి కుటుంబంకు ట్రస్ట్ చైర్‌పర్సన్ సంచయిత మధ్య వార్ . కోట బురుజుపై కూర్చోని సిరిమాను దర్శించుకోవడం రాజు కుటుంబీకుల ఆనవాయితీ. ముందుగానే కోట బురుజుపై చేరుకున్న ఆనంద గజపతి రెండో భార్య సుధ. సుధ గజపతితో పాటు ఆమె కూతురు ఊర్మిళా గజపతి . సుధ గజపతి కుటుంబం కోటపై కూర్చుంటే ట్రస్ట్ చైర్‌పర్స్‌న్‌ హోదాలో.. సంబరానికి వచ్చేదిలేదని తెగేసి చెప్పిన సంచయిత. సుధ గజపతి కుటుంబాన్ని కోటపై నుంచి కిందకు దింపమని అధికారులకు ఆదేశం. సుధ గజపతి కుటుంబాన్ని కిందకు దించడం కుదరదని చెప్పిన అధికారులు . చేసేదేమిలేక సుధ గజపతి కుటుంబంతో కలిసి సిరిమాను దర్శించుకున్న సంచయిత.
  • విజయవాడ: రాజధాని రైతులకు బేడీలు వేయడంపై మండిపడ్డ టీడీపీ పోలిట్‌ బ్యూరో సభ్యుడు బోండా ఉమ, మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని వెల్లడి .
  • ఢిల్లీ: బండి సంజయ్ అరెస్ట్‌ ఘటనపై స్పందించిన జాతీయ బీసీ కమిషన్ . పోలీసుల దురుసు ప్రవర్తనపై సుమోటోగా కేసు నమోదు. తెలంగాణ సీఎస్‌, డీజీపీకి నోటీసులు . నవంబర్ 5లోగా పూర్తి వివరాలు అందించాలని ఆదేశం . అధికారులు, పోలీసులపై ఎందుకు కేసు నమోదు చేయకూడదు. బండి సంజయ్ హక్కులను రక్షించడమే బీసీ కమిషన్ విధి. - నోటీసులో పేర్కొన్న జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి.
  • దేశ రాజధానిలో తిరిగి విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక్క రోజే దాదాపు 5 వేల కొత్త కేసులు నమోదు. అప్రమత్తం అయిన కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు. దసరా పండగ ఎఫెక్ట్ అంటున్న వైద్య నిపుణులు. 3 వేలకు పైగా కంటైన్మెంట్ జోన్లు. కోవిడ్ నిబంధనలను గాలికి వదిలేసిన దేశరాజధాని ప్రజలు.

ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి నా కృతజ్ఞతలు, తమన్నా

కోవిడ్-19 బారిన పడిన తనకు ఎంతో బాగా చికిత్స చేసి పూర్తిగా కోలుకునేలా చూసిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లకు, వైద్య సిబ్బందికి సినీ నటి తమన్నా కృతజ్ఞతలు తెలిపింది.

recovered ffrom covid 19 tamannah thanks medical staff for helping her, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ కి నా కృతజ్ఞతలు, తమన్నా

కోవిడ్-19 బారిన పడిన తనకు ఎంతో బాగా చికిత్స చేసి పూర్తిగా కోలుకునేలా చూసిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లకు, వైద్య సిబ్బందికి సినీ నటి తమన్నా కృతజ్ఞతలు తెలిపింది. కరోనా వైరస్ పాజిటివ్ కి గురైన తాను చాలా నీరసపడిపోయానని, బలహీనపడ్డానని, ఒక దశలో భయమేసిందని  ఆమె తెలిపింది. కానీ మీ అసమాన సేవలతో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలిని చేశారని, ఇందుకు ఎంతో రుణపడి ఉంటానని పేర్కొంది. మీరు చూపిన శ్రధ్ద, ఆప్యాయత మరువలేనివని, మీ సేవలను మాటలలో వర్ణించలేమని తమన్నా వారిని ప్రశసించింది. ఈ నెల 5 న కోవిడ్ కి గురైన తమన్నా వెంటనే హాస్పిటల్ లో అడ్మిట్ అయి ఇటీవలే డిశ్చార్జ్ అయింది. ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగైదు సినీ ప్రాజెక్టులున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) on

Related Tags