భారత్‌లో ఒక్కరోజే 67వేల కరోనా కేసులు.. 942మంది మృతి!

దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నా కేసులు సంఖ్య మాత్రం తగ్గడంలేదు. నిత్యం దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు

భారత్‌లో ఒక్కరోజే 67వేల కరోనా కేసులు.. 942మంది మృతి!
Follow us

| Edited By:

Updated on: Aug 13, 2020 | 11:31 AM

Coronavirus In India:  దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నా కేసులు సంఖ్య మాత్రం తగ్గడంలేదు. నిత్యం దేశంలో రికార్డు స్థాయిలో దాదాపు 900మందికి పైగా కొవిడ్‌ రోగులు మృత్యువాతపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా నేడు రికార్డు స్థాయిలో 67 వేల మంది క‌రోనాబారిన ప‌డ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో ఉన్న‌ది. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 66,999 పాజిటివ్‌ కేసులు న‌మోద‌వ‌గా, 942 మంది బాధితులు మ‌ర‌ణించారు.

ఇప్ప‌టివ‌ర‌కు 23,96,638 మందికి క‌రోనా వైర‌స్ సోకింది. ఇందులో 16,95,982 మంది బాధితులు కోలుకోగా, మ‌రో 6,53,622 కేసులు యాక్టివ్‌గా ఉన్న‌యి. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 47,033 మంది మ‌ర‌ణించార‌ని కేంద్ర ఆరోగ శాఖ ప్ర‌క‌టించింది. రోజురోజుకు భారీగా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్న‌ప్ప‌టికీ, కోలుకుంటున్న ‌వారిసంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న‌ది. దీంతో రిక‌వ‌రీ రేటు 70 శాతానికి చేరుకోగా, మ‌ర‌ణా‌ల రేటు 1.98 శాతంగా ఉంది.

[svt-event date=”13/08/2020,11:31AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Read More:

హెల్మెట్‌లకు బీఐఎస్‌ లేకుంటే ఇక బాదుడే!

అక్కడి మెడికల్‌ కళాశాలల డిగ్రీలు చెల్లవు: ఎంసీఐ