మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విలయం

మహారాష్ట్రలో కరోనా వైరస్ జోరుతో విస్తరిస్తోంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసులతో జనం బెంబెలేత్తుతున్నారు. గురువారం ఒక్కరోజే దాదాపు పది వేలకు చేరువగా కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విలయం
Follow us

|

Updated on: Jul 23, 2020 | 9:54 PM

మహారాష్ట్రలో కరోనా వైరస్ జోరుతో విస్తరిస్తోంది. రోజు రోజుకి పెరుగుతున్న కేసులతో జనం బెంబెలేత్తుతున్నారు. గురువారం ఒక్కరోజే దాదాపు పది వేలకు చేరువగా కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారుల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. కరోనా బాధితులకు అందుబాటులో ఉన్న ఆస్పత్రులతో పాటు చాలా మందిని హోం క్వారంటైన్ చేస్తున్నారు అధికారులు.

గురువారం కొత్తగా 9,865 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇవాళ ఒక్కరోజే 298 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 12,854కి చేరుకుంది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రంలో 3,47,502 మంది కరోనా బారిన పడ్డారని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,36,980 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఇక ఇప్పటివరకు 1,94,253 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ముంభై మహానగరంలో కరోనా కేసులతో విలవిలలాడుతోంది. ఇవాళ 1,257 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా,  55 మంది మృతి చెందారు. ఒక్క ముంభైలో ఇప్పటి వరకు 1,05,829 మందికి కరోనా సోకగా, 5,927 మంది మృత్యువాత పడ్డారు.