Breaking News
  • అమరావతి: తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లకు అందని జీతాలు. వివిధ జిల్లాల్లో తహశీల్దార్లను రీషఫ్లింగ్‌ చేసిన కలెక్టర్లు. సాంకేతిక ఇబ్బందితో దాదాపు 100 మందికిపైగా అందని జీతాలు. జీతాలు అందని తహశీల్దార్లకు వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని. డిప్యూటీ సీఎం ధర్మానకు రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ వినతి. అవసరమైతే కలెక్టర్లకు జీతాలు ఆపాలని. తహశీల్దార్లకు మాత్రం జీతాలు ఆపొద్దని రెవెన్యూ సంగాల వినతి.
  • డ్రగ్స్‌ కేసులో ఆరోపణలపై దీపికా పదుకొణె మండిపాటు. కేసులో తనను కావాలనే ఇరికిస్తున్నారంటూ.. జయాసాహా, కరీష్మా ప్రకాశ్‌పై మండిపడ్డ దీపికా. న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న దీపికా. 12 మంది లాయర్లతో సంప్రదింపులు. గోవా నుంచి ముంబై బయల్దేరిన దీపిక.
  • సీఎం సతీమణి భారతి తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో తండ్రితో పాటు ఉన్న భారతిని.. అనవసరమైన వివాదాల్లోకి లాగుతున్నారు-మంత్రి కొడాలి నాని. తిరుపతికి సతీసమేతంగా సీఎం ఎందుకు రాలేదనడం బీజేపీ నేతలకు సమంజసమేనా. మచ్చలేని పరిపాలన అందిస్తున్న మోదీని వివాదాల్లోకి లాగడం.. రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి సమంజసమేనా-మంత్రి కొడాలి నాని.
  • ఏసీబీ అధికారులకు మాజీమంత్రి అయ్యన్న, ఎమ్మెల్యే వెలగపూడి ఫిర్యాదు. మంత్రి జయరాంపై ఫిర్యాదు చేసిన అయ్యన్నపాత్రుడు, వెలగపూడి. మంత్రి జయరాం, ఆయన కుమారుడిపై ఫిర్యాదు చేశాం. ఆధారాలుంటే చూపించండి రాజీనామా చేస్తామని జయరాం అన్నారు. అన్ని ఆధారాలు చూపించా-మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. ఏసీబీ ప్రభుత్వం కంట్రోల్‌లో ఉంది. న్యాయం జరగకపోతే గవర్నర్‌ను కలుస్తాం-అయ్యన్నపాత్రుడు.
  • సినీ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌సింగ్‌కు సమన్లు. నోటీసులు అందుకున్నట్టు వెల్లడించిన రకుల్‌ప్రీత్‌సింగ్‌. రేపు ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరుకానున్న రకుల్‌ప్రీత్‌సింగ్‌. డ్రగ్స్‌ కేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌పై ఆరోపణలు.
  • కడప: కలెక్టరేట్‌ ఎదుట బీజేపీ నేతల నిరసన. సీఎం జగన్‌ ప్లాన్‌ ప్రకారమే అంతా నడుస్తోంది. జగన్‌ మౌనంగా ఉంటూ ఆనందిస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతోంది. వైవీ సుబ్బారెడ్డి, కొడాలి నాని వెంటనే రాజీనామా చేయాలి. -మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.
  • మహారాష్ట్ర: భివాండిలో భవనం కూలిన ఘటనలో 41కి చేరిన మృతుల సంఖ్య. ఘటనా స్థలంలో పూర్తయిన సహాయక చర్యలు.

బాలీవుడ్ లో టాలీవుడ్ ఫీవర్..!

, బాలీవుడ్ లో టాలీవుడ్ ఫీవర్..!

భాష ఏదైనా సినిమాలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారని చాలా సినిమాలు మనకు రుజువు చేశాయి. తెలుగు, హిందీ అనే తేడా ఏముంటుంది. ప్రేక్షకుడు కనెక్ట్ అయితే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. కానీ కొంతమంది దర్శక నిర్మాతలు హిట్లు కొట్టాలనే ధ్యేయంతో రీమేక్ బాట పట్టారు. వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలు మళ్ళీ తెరకెక్కించడం మొదలు పెట్టారు. ఇలా ఎక్కువగా మన తెలుగు సినిమాలు హిందీలో రీమేక్ అవడం మొదలయ్యాయి.

మొదటి రీమేక్ సినిమా ఏంటంటే..?

హిందీలో మొదట రీమేక్ అయిన దక్షిణాది చిత్రం ఏది అంటే ఎవరికి తెలియదు. ఆ సినిమా ఇంకేదో కాదు సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘రాముడు భీముడు’. ఈ సినిమాను ‘రామ్ ఔర్ శ్యామ్’ అనే టైటిల్ తో తీశారు. ఇక అప్పటి నుంచి బాలీవుడ్ లో దక్షిణాది హవా నడుస్తోంది. అయితే అమిర్ ఖాన్ నటించిన ‘గజిని’ చిత్రం 100 కోట్లు కలెక్ట్ చేసిన తర్వాత రీమేక్స్ జోరు ఊపందుకుంది. దీనితో మన తెలుగు సినిమా హక్కుల డిమాండ్ ఉత్తరాదిలో బాగా పెరిగింది.

అతడు (ఏక్- ది పవర్ అఫ్ వన్), పోకిరి (వాంటెడ్), రెడీ (రెడీ), కిక్ (కిక్), విక్రమార్కుడు(రౌడీ రాథోర్), ఒక్కడు(తేవర్), మర్యాద రామన్న(సన్ అఫ్ సర్దార్) తదితర చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అయ్యాయి. అయితే ఈ మధ్య ఈ రీమేక్ లు ఇంకాస్త ఎక్కువయ్యాయి. హిందీ ప్రేక్షకులకు తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దర్శకులు రూపొందిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ‘ప్రస్థానం’, ‘అర్జున్ రెడ్డి’, ‘ఆర్ ఎక్స్ 100’ ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’ రిలీజ్ అయి మంచి విజయాన్ని నమోదు చేసింది.

సంజయ్ దత్ ‘ప్రస్థానం’…

సాయి కుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లో దేవా కట్టా డైరెక్షన్ లో రూపొందిన చిత్రం ‘ప్రస్థానం’. ఈ చిత్రం అప్పట్లో విమర్శకుల ప్రశంసలు పొందడమే కాదు మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో అదే టైటిల్ తో రీమేక్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ రూపొందించిన దేవా కట్టా ఈ చిత్రానికి దర్శకుడు. సంజయ్ దత్, అలీ ఫజల్, అమైరా దస్తూర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

, బాలీవుడ్ లో టాలీవుడ్ ఫీవర్..!

ఇక్కడ విజయ్.. అక్కడ షాహిద్

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన చిత్రం ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాన్ని అందుకుంది. కాస్త బోల్డ్ కంటెంట్ ఎక్కువున్నా ఈ చిత్రానికి అటు సినీ ప్రముఖుల నుంచి ఇటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఇప్పుడు దీనిని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్నాడు.

, బాలీవుడ్ లో టాలీవుడ్ ఫీవర్..!

 

ఎన్టీఆర్ ‘టెంపర్’.. రణవీర్ ‘సింబా’

రణవీర్ సింగ్, సారా అలీ ఖాన్ హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ రోహిత్ శెట్టి రూపొందించిన చిత్రం ‘సింబా’. ఇది ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ‘టెంపర్’ రీమేక్. గతేడాది రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 350 కోట్లు కలెక్ట్ చేసినట్లు విశ్లేషకుల అంచనా.

, బాలీవుడ్ లో టాలీవుడ్ ఫీవర్..!

బాలీవుడ్ కు ‘కిరాక్ పార్టీ’..

కన్నడ హిట్ ‘కిరిక్ పార్టీ’ తెలుగులో నిఖిల్ హీరోగా ‘కిరాక్ పార్టీ’ టైటిల్ తో రూపొందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ లో రీమేక్ కానుందట. యువ హీరో కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో అభిషేక్ జైన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్ గా నటిస్తుందట.

, బాలీవుడ్ లో టాలీవుడ్ ఫీవర్..!

ఇక్కడ కార్తికేయ.. అక్కడ అహాన్ శెట్టి

ప్రేయసి చేతిలో మోసపోయిన ప్రియుడి కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఎక్స్100’. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రం పెద్ద విజయం నమోదు చేసింది. ఈ చిత్రానికి అజయ్ భూపతి డైరెక్టర్. ప్రస్తుతం ఈ సినిమా బాలీవుడ్ లో అహాన్ శెట్టి హీరోగా రీమేక్ కానుందట. సాజిద్ నదియాద్ వాలా ఈ చిత్రానికి నిర్మాత.

, బాలీవుడ్ లో టాలీవుడ్ ఫీవర్..!

వీటితో పాటు పూర్వం తెలుగులో హిట్ అయిన పలు చిత్రాలు కూడా హిందీ లో రీమేక్ కానున్నాయి అని వినికిడి.

Related Tags