మధ్యప్రదేశ్ : బీజేపీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు..

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఊహించిందే జరిగింది. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు శనివారం అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..ఎమ్మెల్యేలకు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 21 మంది ప్రస్తుతం బీజేపీలో చేరగా, మరో ఎమ్మెల్యే అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. ఆయన మరికొద్ది రోజుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో […]

మధ్యప్రదేశ్ :  బీజేపీ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు..
Follow us

|

Updated on: Mar 21, 2020 | 7:58 PM

మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఊహించిందే జరిగింది. జ్యోతిరాదిత్య సింధియాకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు శనివారం అధికారికంగా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..ఎమ్మెల్యేలకు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 21 మంది ప్రస్తుతం బీజేపీలో చేరగా, మరో ఎమ్మెల్యే అనివార్య కారణాల వల్ల హాజరుకాలేకపోయారు. ఆయన మరికొద్ది రోజుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల కాంగ్రెస్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు విధేయులుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. దీంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్‌ను గవర్నర్ ఆదేశించడం, కమల్‌నాథ్ దీనిపై అభ్యంతరం చెప్తూ.. సుప్రీం మెట్లు ఎక్కడం జరిగాయి. అయితే శుక్రవారం సాయంత్రం 5 గంటలలోపు బలనిరూపణ చేసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలిచ్చింది. నాటికీయ పరిణామాల మధ్య బలపరీక్షకు ముందే కమల్‌నాథ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో బీజేపీ మరోసారి అధికార పీఠం ఎక్కబోతుంది.

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా