అంతా చేసింది “సిద్దూ”నే ..రెబల్ ఎమ్మెల్యే ఆరోపణలు

కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సినియర్ నేత కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేడీఎస్ కాంగ్రెస్ కూటమి నుంచి కర్నాటక సీఎంగా కుమారస్వామి పదవిని కొనసాగించారు. 14 నెలల తర్వాత 16 మంది ఇరుపార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాల వెనుక కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ఉన్నారనే ఆరోపణలు చేశారు అసమ్మతి ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్. తమను పార్టీకి దూరంగా ఉండాలని చెప్పారని, కానీ ఇప్పుడు […]

అంతా చేసింది సిద్దూనే ..రెబల్ ఎమ్మెల్యే ఆరోపణలు
Follow us

| Edited By:

Updated on: Jul 26, 2019 | 1:55 PM

కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలిపోడానికి మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సినియర్ నేత కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జేడీఎస్ కాంగ్రెస్ కూటమి నుంచి కర్నాటక సీఎంగా కుమారస్వామి పదవిని కొనసాగించారు. 14 నెలల తర్వాత 16 మంది ఇరుపార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామాల వెనుక కాంగ్రెస్ నేత సిద్దరామయ్య ఉన్నారనే ఆరోపణలు చేశారు అసమ్మతి ఎమ్మెల్యే శివరామ్ హెబ్బార్. తమను పార్టీకి దూరంగా ఉండాలని చెప్పారని, కానీ ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. కర్నాటకలో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితికి మూలకారణం సిద్ధరామయ్యేనన్నారు.

ఇదిలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలపై స్పందించారు. పార్టీని బలహీనపర్చడానికే ఇలాంటి ఆరోణలు చేస్తున్నారని మండిపడ్డారు. లేనిపోని విధంగా ఇలా మాట్లాడితే తప్పకుండా బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అయితే .. అసెంబ్లీలో బలపరీక్ష జరిగిన రోజు ఆయన కుమారస్వామిపై అసహనంతో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రెబల్ ఎమ్మెల్యే ఇలాంటి ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.