Breaking News
  • తూ.గో: పెద్దాపురంలో దారుణం. యర్రా శివశంకర్‌ అనే వ్యక్తిపై నగేష్‌ కత్తితో దాడి. పరిస్థితి విషమం, కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలింపు.
  • అమరావతి: ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని ఖూనీచేశారు. ప్రలోభాలకు లొంగలేదనే మండలి రద్దు తీర్మానం చేశారు. సెలెక్ట్‌ కమిటీ అంటే జగన్‌కు ఎందుకంత భయం. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎందుకు విచారణ జరపలేదు -ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు.
  • మద్దాల గిరిని ఆర్థికంగా బెదిరించి పార్టీలోకి లాక్కున్నారు.
  • 11 మంది భారతీయ మత్స్యకారులను బంధించిన శ్రీలంక. ఒక పడవను స్వాధీనం చేసుకున్న శ్రీలంక నేవీ సిబ్బంది.
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. 16 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.02 కోట్లు. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 44,366 మంది భక్తులు.
  • సూర్యాపేట జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌ బదిలీ. అమోయ్‌ కుమార్‌ను రంగారెడ్డి జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు. నేరేడుచర్ల ఇంచార్జి కమిషనర్‌ మహేందర్‌రెడ్డి సస్పెన్షన్‌. తహశీల్దార్‌ రాంరెడ్డికి ఇంచార్జి బాధ్యతలు. కేవీపీ ఓటు విషయంలో అధికారుల తీరుపై ప్రభుత్వం చర్యలు.

అలా జరిగి ఉంటే కశ్మీర్ సమస్య ఉండేదే కాదు: అమిత్ షా

, అలా జరిగి ఉంటే కశ్మీర్ సమస్య ఉండేదే కాదు: అమిత్ షా

రాజమండ్రి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాజమండ్రి సభలో ప్రసంగించారు. కశ్మీర్ సమస్య ఇప్పటికీ కొనసాగుతుండటానికి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే కారణమని ఆయన ఆరోపించారు. ఆనాడు నెహ్రూ కాకుండా భారత ప్రధానిగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అయ్యింటే కశ్మీర్ సమస్య ఉండేదే కాదని అన్నారు. కశ్మీర్ సమస్యకు కారణం ఎవరు అని చెప్పాల్సి వస్తే అది నెహ్రూ తప్ప మరో పేరు ఉండదని షా అన్నారు.

భారత దేశం యావత్తు అమర జవాన్లకు నివాళులర్పిస్తుంటే కాంగ్రెస్ మాత్రం రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని విమర్శించారు. పుల్వామా దాడి తర్వాత ప్రధాని మోడీ షూటింగ్‌లలో పాల్గొన్నారంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు ఇలాంటివేనని చెప్పారు. సరిగ్గా పుల్వామా ఘటన జరిగిన సమయంలోనే మోడీ గారు ఒక ఈవెంట్‌లో ఉన్నారని దాన్ని కాంగ్రెస్ పార్టీ వాడుకుని రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని షా ఆగ్రహం వ్యక్తం చేశారు.