Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

64 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్ మీ ఎక్స్‌టీ!

భారతదేశ స్మార్ట్ ఫోన్ లో మిడ్ రేంజ్ ఫోన్లకు ఉండే క్రేజ్ వేరు. మన దేశంలో సాధారణ మధ్యతరగతి వారిని ఆకట్టుకునేలా మంచి ఫీచర్లలో మిడ్ రేంజ్ ఫోన్లు విడుదల చేస్తే ఆ సంస్థే దేశంలోనే నంబర్ వన్ స్మార్ట్ ఫోన్ కంపెనీగా అవతరించగలదు. ఈ పల్స్ పట్టుకుంది కాబట్టే షావోమి ఈ రంగంలో ఎప్పట్నుంచో నంబర్ వన్ గా నిలబడింది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.

షావోమి మార్కెట్ కు ఒప్పో, వివోల నుంచి ఎటువంటి ముప్పూ లేకపోయినా.. ఒప్పో సబ్ బ్రాండ్ అయిన రియల్ మీ షావోమి మార్కెట్ కు గండి కొట్టే దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. రియల్ 3, 3 ప్రో.. వాటి తర్వాతి వెర్షన్లు రియల్ మీ 5, 5 ప్రోలతో ఇప్పటికే రెడ్ మీ మార్కెట్ కు కొంతమేర గండి కొట్టిన రియల్ మీ తాజాగా రియల్ మీ ఎక్స్ టీ అంటూ మరో ఫోన్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వెనకవైపు 64 మెగా పిక్సెల్ కెమెరా ఉందంటూ చేసిన ప్రచారం ఈ ఫోన్ కు చాలా మేరకు కలిసివచ్చింది. ఇంతకీ ఆ ఫోన్ ఎలా ఉందంటే.. రియల్ మీ ఎక్స్ టీ మూడు వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999గా ఉంది. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999 కాగా, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,999గా నిర్ణయించారు.

ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ ఆఫర్ కింద ఆరు నెలల పాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ లభించనుంది. ఈ ఫోన్ నీలం(బ్లూ), తెలుపు(వైట్) రంగుల్లో మాత్రమే అందుబాటులో ఉంది. ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉన్న నాలుగు కెమెరాల సెటప్ ను వెనకాల అందించడంతో కెమెరాల విషయంలో రియల్ మీ మిగతా ఫోన్ల కంటే చాలా ముందుంది. 64 మెగా పిక్సెల్ సామర్థ్యం ఉన్న కెమెరా, వెనకవైపు నాలుగు కెమెరాలు ఉండటం మంచిదే అయినా, మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నాలుగు లెన్స్ లనూ ఉపయోగించి మీరు ఒకే ఫొటో తీయలేరు. మీరు ఎంచుకునే కెమెరా మోడ్ ని బట్టి.. లెన్స్ ల ఉపయోగం మారుతుంది.

మీరు రూ.15,000 నుంచి రూ.20,000 మధ్యలో మంచి ఫోన్ కోసం వెతుకుతున్నారంటే.. రియల్ మీ ఎక్స్ టీని కచ్చితంగా తీసుకోవచ్చు. మీరు రియల్ మీ ఎక్స్ తో దీన్ని పోలిస్తే పెద్దగా సంతృప్తి చెందలేకపోవచ్చు. కొత్త ప్రాసెసర్, 64 మెగా పిక్సెల్ కెమెరా, వెనకవైపు నాలుగు కెమెరాలు.. ఇవన్నీ పేపర్ మీద రాసుకుని చూస్తే ఉన్నంత గొప్పగా ఫోన్ వాడుతుంటే అనిపించలేదు. కానీ ఈ ధరల శ్రేణిలో ఉన్న షావోమి, శాంసంగ్, ఇతర ఫోన్లతో పోలిస్తే మాత్రం కచ్చితంగా ఒక అడుగు ముందే ఉంటుంది.