Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 68 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 968876. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 331146. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 612815. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 24915. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై గంటన్నర నుంచి కొనసాగుతున్న వాదనలు. ప్రస్తుతం గుంటూరు రమేష్ ఆసుపత్రిలో ఉన్న అచ్చెన్నాయుడు. ఈఎస్ఐ స్కాం లో అక్రమాలకు పాల్పడ్డారని అచ్చెన్నాయుడు ని అరెస్టు చేసిన ఏసీబీ. ఈ కేసులో అచ్చెన్నాయుడుని ఏ2గా చేర్చిన ఏసీబీ.
  • కర్నూలు టీవీ9 ఎఫెక్ట్: వర్షపు నీరు వచ్చిన కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలోనీ కోవిడ్ వార్డును తనిఖీ చేసిన సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి. ఇంకోసారి ఇ వర్షపు నీరు రాకుండా చూస్తావని వార్డు లోని ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని హామీ.
  • రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ను కలిసిన రఘురామకృష్ణ రాజు. పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ గా ఉన్నందున సలహాలు సూచనల కోసం రాజ్ నాథ్ సింగ్ ను కలిసా..రాజకీయాలు చర్చించలేదు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించే అంశానికి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని సమాచారం. రాష్ట్రమే భద్రత కల్పిస్తామని చెప్తున్నట్లు సమాచారం..ఎం జరుగుతుందో వేచి చూడాలి. నేను ఏ పార్టీలో చేరడం లేదు..ఒక ఎంపీగా కేంద్రమంత్రులని కలుస్తున్నా. పార్టీకి,పార్టీ అధ్యక్షుడికి సలహాలు సూచనలు ఇవ్వలేదు.
  • విద్యాశాఖపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కెసిఆర్ . విద్యాశాఖపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష. మంత్రి సబిత, అధికారులతో సీఎం సమావేశం. విద్యాసంవత్సరం, పరీక్షలు, ఇతర అంశాలపై చర్చ.
  • అంజనీకుమార్, సీపీ,హైదరాబాద్:- హైదరాబాద్ సిటీలో మార్చ్ నుండి ఇప్పటి వరకు 24 గంటలు గా పబ్లిక్ సేఫ్టీ , కరోనా వరైస్ పరిస్థితుల్లో యుద్ధం చేస్తున్నాం . కరోనా యుద్ధం వరల్డ్ వారు లాంటిది అని నేను భావిస్తున్న. హైదరాబాద్ సిటీలో ఆర్మ్ ఫోర్స్ చాలా కీలకంగా పని చేశారు . వినాయక చవితి దగ్గర నుండి కరోనా కట్టడి వరకు కార్ హెడ్ క్వాటర్స్ పోలుసులు కీ రోల్ పోషించారు . ఇతర రాష్ట్రాల తో పోలిస్తే హైదరాబాద్ లో కరోనా తక్కువ ఉంది . కరోనా కట్టడి యుద్ధం లో ఫైటింగ్ చేసి వచ్చిన 62 మందికి స్వాగతం తెలుపుతున్నాం . కరోనా కష్ట కాలం లో ఇతర రాష్ట్రాల కు చెందిన వలస కార్మికుల ను తరలించము .

“ఆకాశ దీపం’ అసలు రహస్యం ఇదే !

Akasham Deepam Special Story, “ఆకాశ దీపం’ అసలు రహస్యం ఇదే !

శివ కేశవులకు ఎంతో ప్రియమైనది కార్తీక మాసం. అంతేకాదు..ఋషులకు, పితృదేవతలకు, పితృపతి యమ ధర్మరాజునకూ ప్రియమైన మాసము. ఈ పవిత్రమాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్థంభానికి “ఆకాశ దీపాన్ని’ వెళ్లాడ దీస్తారు. చిన్న చిన్న రంద్రాలు చేయబడిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనెపోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పైభాగాన వేలాడదీస్తారు. ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెలుతుంటారు. ఈ ఆకాశదీపాన్నే..యమ దీపమని కూడ వ్యవహరిస్తారు. అయితే సామాన్యంగా దీపం వెలిగించి దేవతలను, ఋషులను ఆహ్వానిస్తాం. కానీ, ఆకాశ దీపం అని పిలవడానికి … ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం వుంది. ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఆకాశదీపారాధన చేసి యమ ధర్మరాజును తమ వైపు రావద్దు అని సూచిస్తున్నట్లుగా వేధాల సారాంశం. అప్పుడు ఆకాశ దీపాన్నిచూచి యముడు తిరిగి తనలోకానికి వెళతాడని ఆకాశ దీపం కనపడని ఊరికి, ఇంటికి వస్తాడని పురాణ వచనం. మోక్షం కోరినా, కోరకున్నా యముడు రావద్దని అందరూ అనుకుంటారు. కావున ప్రతి ఒక్కరూ ఆకాశదీపాన్ని ఈ కార్తిక మాసములో వెలిగించి ఇష్టదైవాన్ని, పితృ దేవతలను ఆహ్వానించి పితృపతిని మాత్రం ఆశీస్సులు అందజేయమని మాత్రమే కోరతారు.. ఆకాశ దీపం ఉన్న ఇంటికి లక్ష్మీ నారాయణులు వస్తారని లేని ఇంటికి యమధర్మరాజు వస్తాడని స్కాందపురాణ వాక్యం. కార్తీక శుద్ధ పాడ్యమి
నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారని పురాణ కథనం.

Related Tags