‘క్రిస్టమస్’, ‘యేసుక్రీస్తు’ జననం వెనుక అసలు రహస్యాలు ఇవే.?

క్రిస్మస్.. క్రైస్తవుల ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు పుట్టినరోజును ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అసలు క్రిస్మస్ అంటే ఏంటి.? దాని అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాటిన్ భాషలో క్రిస్ట అనగా క్రీస్తు.. మస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించి ప్రార్ధనలు చేస్తూ ఆనందించడమే క్రిస్మస్. యేసు క్రీస్తు పుట్టినరోజు నాడు జరుపుకునే ఈ పండగ ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా యేసు పుట్టుక వెనుక […]

'క్రిస్టమస్', 'యేసుక్రీస్తు' జననం వెనుక అసలు రహస్యాలు ఇవే.?
Follow us

| Edited By:

Updated on: Dec 23, 2019 | 11:48 PM

క్రిస్మస్.. క్రైస్తవుల ఆరాధ్య దైవమైన యేసు క్రీస్తు పుట్టినరోజును ఈ పండుగను జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకను డిసెంబర్ 25న ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అసలు క్రిస్మస్ అంటే ఏంటి.? దాని అర్ధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లాటిన్ భాషలో క్రిస్ట అనగా క్రీస్తు.. మస్ అంటే ఆరాధన. క్రీస్తును ఆరాధించి ప్రార్ధనలు చేస్తూ ఆనందించడమే క్రిస్మస్. యేసు క్రీస్తు పుట్టినరోజు నాడు జరుపుకునే ఈ పండగ ఎంతో పవిత్రమైనది. అంతేకాకుండా యేసు పుట్టుక వెనుక ఎన్నో అద్భుతాలు కూడా దాగి ఉన్నాయి.

యేసు పుట్టుక వెనుక చరిత్ర…

రోమ్ సామర్ధ్యాన్ని అగస్టర్ సిజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తుండేవాడు. ఒకానొక సందర్భంలో ఆయన తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో లెక్కపెట్టాలని అనుకున్నాడు. దీంతో అక్కడ నివసించే ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్ళు డిసెంబర్ 25వ తేదీ లోగా వెళ్లిపోవాలని ఆజ్ఞాపించాడు. అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ, జోసెఫ్ అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తున్నారు. అప్పటికే మేరీకి జోసెఫ్‌తో పెళ్లి కుదిరింది.

ఇదిలా ఉండగా ఒకరోజు మేరీకి గ్యాబ్రియల్ అనే దేవదూత ఒకరు కలలో ప్రత్యేక్షమై.. ‘ఓ మేరీ నువ్వు దేవుడి వల్ల అనుగ్రహం పొందావు. నీవు కన్యగానే గర్భవతి కావడమే కాకుండా కుమారుడిని కూడా కంటావు. ఇక ఆ శిశువుకు యేసు అని పేరు పెట్టు.. అప్పుడు అతను దేవుడు కుమారుడిగా అవతారమెత్తుతాడని చెప్పి ఆ దైవదూత మాయమవుతాడు.

ఈ క్రమంలోనే మేరీ గర్భవతి అవుతుంది. ఇది తెలిసి జోసెఫ్ ఆమెను పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకుంటాడు. అయితే ఒక రాత్రి అతని కలలోకి దేవ దూత వచ్చి.. ‘మేరీని నువ్వు విడిచి పెట్టవద్దు.. ఆమె దేవుడి వరం వల్ల గర్భవతి అయింది. ఆమెకు పుట్టే కొడుకు దేవుడి కుమారుడు. తనను నమ్మిన ప్రజలందరినీ పాపాల నుంచి కాపాడే లోక రక్షకుడు అవుతాడని చెప్పి అదృశ్యమవుతాడు. ఆ తర్వాత జోసెఫ్ మేరీని పెళ్లి చేసుకుంటాడు.

అయితే జోసెఫ్ స్వగృహం బెత్లెహెం. అందువల్ల రాజా ఆజ్ఞను శిరసావహించి స్వగ్రామానికి మేరీతో కలిసి బయల్దేరతాడు. తీరా వాళ్ళు బెత్లెహెం చేరుకునేసరికి వాళ్లకు అక్కడ ఉండడానికి వసతి దొరకదు. చివరికి ఒక సత్రపు యజమాని పశువుల పాకలో వాళ్ళకి కాస్త జాగ ఇస్తాడు. అక్కడే మేరీ ఒక శిశివుకు జన్మనిస్తుంది.

ఇక ఆ రాత్రి బెత్లెహెంలోని పొలాల్లో కొంతమంది పశువుల కాపరులు తమ గొర్రెలను కాపలా కాస్తుండగా.. ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చి.. ‘మీకు సంతోషకరమైన శుభవార్త తీసుకొచ్చాను. ఇవాళ బెత్లెహెంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు జన్మించాడు. ఆయనే అందరికి ప్రభువు. ఒక పసికందు పురుటి దుస్తుల్లో చుట్టబడి పశువుల తొట్టిలో పడుకుని ఉంటాడు ఇదే మీకు గుర్తు అని చెప్పి మాయమవుతాడు.

ఇది విన్న గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్లి ఆ పశువుల పాక దగ్గరకు చేరుకుంటారు. అక్కడ పడుకుని ఉన్న శిశువును, మేరీ, జోసెఫ్‌లను చూసి ఆనందపడతారు. ఇక వారు తాము చూసింది. దేవదూత తమకు చెప్పింది అందరికి తెలియజేస్తారు. ఇలా 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24వ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు. లోకరక్షకుడిగా ప్రజలను పాపాల నుంచి కాపాడడానికి అవతారం ఎత్తాడు. అందుకే మర్నాడు డిసెంబర్ 25వ తేదీ క్రిస్టమస్ పండగను జరుపుకుంటారు.