పీవోకే విషయంలో సర్వసన్నద్ధం: ఆర్మీ చీఫ్!

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కార్యకలాపాల కోసం సైన్యం వివిధ ప్రణాళికలు కలిగి ఉందని, “ఏ పనికైనా” సిద్ధంగా ఉందని కొత్త ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే చెప్పారు. “జమ్మూ కాశ్మీర్‌తో సహా సరిహద్దులో మా దళాలను మోహరించాము. మాకు వివిధ ప్రణాళికలు ఉన్నాయి.. అవసరమైతే ఆ ప్రణాళికలను అమలులోకి తెస్తాం. మేము చేయాల్సిన పనిని విజయవంతంగా నిర్వహిస్తాము” అని జనరల్ నరవణే తెలిపారు. మంగళవారం జనరల్ బిపిన్ రావత్ నుంచి బాధ్యతలు స్వీకరించిన తరువాత పాకిస్తాన్ ప్రేరిత […]

పీవోకే విషయంలో సర్వసన్నద్ధం: ఆర్మీ చీఫ్!
Follow us

| Edited By:

Updated on: Jan 03, 2020 | 1:24 PM

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో కార్యకలాపాల కోసం సైన్యం వివిధ ప్రణాళికలు కలిగి ఉందని, “ఏ పనికైనా” సిద్ధంగా ఉందని కొత్త ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే చెప్పారు. “జమ్మూ కాశ్మీర్‌తో సహా సరిహద్దులో మా దళాలను మోహరించాము. మాకు వివిధ ప్రణాళికలు ఉన్నాయి.. అవసరమైతే ఆ ప్రణాళికలను అమలులోకి తెస్తాం. మేము చేయాల్సిన పనిని విజయవంతంగా నిర్వహిస్తాము” అని జనరల్ నరవణే తెలిపారు.

మంగళవారం జనరల్ బిపిన్ రావత్ నుంచి బాధ్యతలు స్వీకరించిన తరువాత పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదంపై ఆర్మీ చీఫ్ ఈ విధంగా తెలిపారు. అటువంటి పరిస్థితిలో “ఉగ్రవాద మూలాల వద్ద ముందస్తుగా పోరాటం చేసే హక్కు భారతదేశానికి ఉంది” అని ఆయన అన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా సాయుధ దళాలు, ప్రభుత్వం ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తున్నాయి.

2016లో జమ్మూ కశ్మీర్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసిన నేపథ్యంలో నియంత్రణ రేఖ మీదుగా ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్‌లు జరిగాయి. గత ఏడాది ఫిబ్రవరిలో, కాశ్మీర్‌లోని పుల్వామాలో ఆత్మాహుతి దాడి తరువాత పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మహ్మద్ శిక్షణా శిబిరాన్ని వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది.

ఆర్టికల్ 370 ను రద్దు చేయాలన్న కేంద్రం చర్యపై.. పాకిస్తాన్‌తో ఉన్న ఉద్రిక్తతల మధ్య సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. నూతన ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. చొరబాట్లు జరగకుండా చూసుకోవడానికి మేము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది, ఇది కష్టమైన పని అని తెలిపారు.