ఫేస్‌ టు ఫేస్ తేల్చుకోవడమే : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

మనల్ని బాధపెట్టాలని ఎవరైనా చూస్తే వారి అంతు తేల్చకుండా వదిలిపెట్టమన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. పాకిస్థాన్ మరో ఉగ్రదాడికి పాల్పడే అవకాశాలున్నాయని, తీర ప్రాంతం గుండా ప్రవేశించి ఈ దాడులు జరిపే వీలుందన్నారు రాజ్‌నాథ్. అయితే మన రక్షణ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైందని ప్రతి విధమైన ఉగ్రదాడుల్ని తిప్పికొట్టగల సత్తా మనకు ఉందన్నారు రాజ్‌నాథ్. కేరళలో కొల్లాంలో జరిగిన మాతా అమృతానందమయి దేవి పుట్టిన రోజు వేడుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో అశాంతిని […]

ఫేస్‌ టు ఫేస్ తేల్చుకోవడమే  : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్
Follow us

| Edited By:

Updated on: Sep 28, 2019 | 2:35 AM

మనల్ని బాధపెట్టాలని ఎవరైనా చూస్తే వారి అంతు తేల్చకుండా వదిలిపెట్టమన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్. పాకిస్థాన్ మరో ఉగ్రదాడికి పాల్పడే అవకాశాలున్నాయని, తీర ప్రాంతం గుండా ప్రవేశించి ఈ దాడులు జరిపే వీలుందన్నారు రాజ్‌నాథ్. అయితే మన రక్షణ వ్యవస్థ అత్యంత శక్తిమంతమైందని ప్రతి విధమైన ఉగ్రదాడుల్ని తిప్పికొట్టగల సత్తా మనకు ఉందన్నారు రాజ్‌నాథ్. కేరళలో కొల్లాంలో జరిగిన మాతా అమృతానందమయి దేవి పుట్టిన రోజు వేడుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలో అశాంతిని రేపేందుకు శత్రువులు అనేక పన్నాగాలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. జమ్ము కశ్మీర్‌లో దారుణమైన పుల్వామా ఘటనలో 40 మంది సైనికులు వీరమరణం పొందారన్నారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోకూడదన్నారు రక్షణ మంత్రి. తాను హోం మంత్రిగా ఉన్నప్పుడే పుల్వామా దారుణం జరిగిందని, దానికి ప్రతిగానే బాలాకోట్‌లో వాయుసేన జరిపిందని తెలిపారు.

ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ విషయంపై  భారత్, పాక్‌లు రెండు తమ వాదన వినిపించిన సంగతి తెలిసిందే. మన దేశం శాంతి కోరుకుంటుందని ఉగ్రవాదం అంతానికి ప్రపంచదేశాలు అన్నీ ఒక్కతాటిపైకి రావాలని ప్రధాని మోదీ ప్రసంగించారు. అయితే కశ్మీర్ విషయంలో అన్ని దారులు మూసుకుపోయిన నిర్వేదంలో ఉన్న పాక్ మాత్రం ఓటమిని అంగీకరించలేని దశలో ఉంది. పైగా భారత్‌తో పోరాటానికి సైతం వెనుకాడబోమంటూ ప్రకటించారు ఆదేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. ఇదిలా ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా యుద్ధం అనివార్యమైతే భారత్ అందుకు తగిన విధంగా రెడీగా ఉంది అనేలా శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాధ్ చేసిన వ్యాఖ్యలున్నాయి.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు