భారత్‌తో యుద్ధానికి సిద్ధమే కానీ..: పాక్ ప్రధాని

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యుద్ధం జరుగుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. భారత ప్రభుత్వం కూడా పాక్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఈ విషయంపై స్పందించారు. ఆ దేవుడికే తెలియాలి ముందుగా రికార్డ్ చేసిన ఇమ్రాన్ ఖాన్ వీడియోను పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. భారత్ యుద్ధానికి దిగితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని ఇమ్రాన్ ఖాన్ ఆ […]

భారత్‌తో యుద్ధానికి సిద్ధమే కానీ..: పాక్ ప్రధాని
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:54 PM

ఇస్లామాబాద్: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యుద్ధం జరుగుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. భారత ప్రభుత్వం కూడా పాక్‌కు వ్యతిరేకంగా పావులు కదుపుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాక్ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా ఈ విషయంపై స్పందించారు.

ఆ దేవుడికే తెలియాలి

ముందుగా రికార్డ్ చేసిన ఇమ్రాన్ ఖాన్ వీడియోను పాక్ ప్రభుత్వం విడుదల చేసింది. భారత్ యుద్ధానికి దిగితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధమేనని ఇమ్రాన్ ఖాన్ ఆ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం మొదలుపెట్టడం తేలికే. అది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ దాని ముగింపు ఎలా ఉంటుందనేది ఆ దేవుడికే తెలుస్తుందని అన్నారు.

అయితే పాక్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందు ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త వాతావరణం నెలకొందని, కలగజేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇది జరిగిన మరుసటిరోజే ఇమ్రాన్ ఖాన్ వీడియో బయటకు రావడం విశేషం.

విచారణకు సిద్ధమే

ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి, పాకిస్థాన్‌కు ఎలాంటి సంబంధం లేదని ఇమ్రాన్ ఖాన్ వీడియోలో చెప్పారు. ఇది సరికొత్త పాకిస్థాన్, మాకు అభివృద్ధి కావాలి. భారత్‌పై దాడి చేస్తే మాకు ఒరిగేదేమీ ఉండదు. అసలు మేమెందుకు దాడి చేయిస్తాం. మా దేశమే ఉగ్రవాదంతో సతమతమౌతుంది.

ఉగ్రవాదం అంతానికి మేము కూడా కృషి చేస్తున్నాం అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. పుల్వామా ఉగ్రదాడిపై ఎలాంటి విచారణ చేయించడానికైనా సిద్ధమే. అయితే అందుకు భారత్ ఆధారాలు ఇవ్వాలి. ఆధారాలు లేకుండా మమ్మల్ని నిందించడం సరికాదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

ఎదురుదాడి తప్పదు

మీరు మా దేశంపై దాడి చేస్తే మేము ఎదురుదాడి చేయకుండా ఉంటామా? తప్పకుండా ఎదురుదాడి చేస్తాం అని పాక్ ప్రధాని అన్నారు. పదే పదే పాకిస్థాన్‌పై వేలెత్తి చూపించడం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో పాకిస్థాన్ ప్రమేయం ఉందని తేలితే విచారణ చేయిస్తాను. అందుకు నాదీ హామీ. భారత్ మాపై దాడి చేస్తే ఎదురు దాడి చేయకుండా ఎలా ఉంటాం. తప్పకుండా మా నుంచి ప్రతిచర్య ఉంటుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

భారత స్పందనపై నెలకొన్న ఆసక్తి

ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 23 ఏళ్ల క్రితం పాకిస్థాన్‌కు ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గుర్తింపును ఉపసంహరించుకుంది. పాక్ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే వస్తువులపై 200 శాతం సుంకాన్ని పెంచింది.

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి అయిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బాస్ మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ప్రపంచ మద్దతు కూడగడుతుంది. ఇదిలా ఉంటే పాక్ ప్రధాని వ్యాఖ్యలకు భారత్ నుంచి ఎలాంటి రిప్లై ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.