‘సన్’ బెర్త్ వారి చేతుల్లోనే..!

సన్‌రైజర్స్ ప్లే‌ఆఫ్ ఆశలు గల్లంతు  విజయంతో ముగించిన బెంగళూరు  చెలరేగిన హెట్‌మైర్, గురుకీరత్‌   ఐపీఎల్ 12వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చిరునవ్వుతో సీజన్‌ను పూర్తి చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (70*; 43 బంతుల్లో 5×4, 4×6) అజేయ […]

'సన్' బెర్త్ వారి చేతుల్లోనే..!
Follow us

|

Updated on: May 05, 2019 | 6:36 AM

  • సన్‌రైజర్స్ ప్లే‌ఆఫ్ ఆశలు గల్లంతు 
  • విజయంతో ముగించిన బెంగళూరు 
  • చెలరేగిన హెట్‌మైర్, గురుకీరత్‌  

ఐపీఎల్ 12వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయంతో ముగించింది. చివరి లీగ్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి చిరునవ్వుతో సీజన్‌ను పూర్తి చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ (70*; 43 బంతుల్లో 5×4, 4×6) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్‌లో చెలరేగి భారీ సిక్సర్లు, బౌండరీలతో జట్టు స్కోరును 170 దాటించాడు. మార్టిన్‌ గప్తిల్‌ (30; 23 బంతుల్లో 2×4, 2×6), వృద్ధిమాన్‌ సాహా (20; 11 బంతుల్లో 4×4), విజయ్‌ శంకర్‌ (27; 18 బంతుల్లో 3×6) మెరిశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు.. ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్ పార్థివ్‌ (0), కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (16; 7 బంతుల్లో 2×4, 1×6), ఏబీ డివిలియర్స్‌ (1; 2 బంతుల్లో) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన వెస్టిండీస్‌ బ్యాట్స్‌మెన్ హెట్‌మైయిర్‌ (75; 47 బంతుల్లో 4×4, 6×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. భారీ సిక్సర్లు, బౌండరీలతో సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. అతడికి తోడుగా గురుకీరత్‌ సింగ్‌ మన్‌ (65; 48 బంతుల్లో 8×4, 1×6) అజేయ అర్ధశతకం తోడవ్వడంతో బెంగళూరు లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. హెట్‌మైయిర్‌, గురుకీరత్‌ నాలుగో వికెట్‌కు 144 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి రికార్డు సృష్టించారు. ఐపీఎల్‌లోనే నాలుగో వికెట్‌కు ఇది అత్యధిక భాగస్వామ్యం. దీంతో సన్‌రైజర్స్ ప్లే‌ఆఫ్ రేస్‌లో నిలవాలంటే ఈరోజు జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా‌పై ముంబై ఇండియన్స్ తప్పక విజయం సాధించాలి.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?