మ్యాచ్‌ను తిప్పేశాడు..సిరాజ్ సంచలన ప్రదర్శన

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మోర్గాన్ జట్టు పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ సంచలన ప్రదర్శనతో మ్యాచ్‌ను తిప్పేశాడు.

  • Sanjay Kasula
  • Publish Date - 9:59 pm, Wed, 21 October 20

RCB Pacer Sets New Record : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మోర్గాన్ జట్టు పీకలలోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్ సంచలన ప్రదర్శనతో మ్యాచ్‌ను తిప్పేశాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో సిరాజ్‌ అద్భుత బౌలింగ్‌తో ప్రత్యర్థిని గడగడలాడించాడు. పదునైన పేస్‌తో బెంబేలెత్తించిన సిరాజ్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.

సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి ఓపెనర్‌ రాహుల్‌ త్రిపాఠి(1) వికెట్‌ కీపర్‌ డివిలియర్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే అప్పుడే క్రీజులోకి వచ్చిన నితీశ్‌ రాణా(0) బౌల్డ్‌ అయ్యాడు. నవదీప్‌ సైనీ వేసిన మూడో ఓవర్‌లో మరో ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌(1) కూడా ఔటయ్యాడు. రెండో బంతిని భారీ షాట్‌ ఆడగా మిడాన్‌లో క్రిస్‌మోరీస్‌ చేతికి చిక్కాడు.