రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్…

ఐపీఎల్-13 సీజన్‌లో ప్లే ఆఫ్ రేసుకి చేరువైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో మిగిలిన పీడకలన మరిచిపోయి.. అద్భుతంగా ఆడుతూ టైటిల్ ఫెవరెట్ మారింది. అయితే ప్లేఆఫ్ చేరువైన సమయంలో ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. చెన్నై  సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ నవ్ దీప్ సైనీ కుడి చేతికి గాయమైంది.

  • Sanjay Kasula
  • Publish Date - 6:39 pm, Mon, 26 October 20

Navdeep Saini : ఐపీఎల్-13 సీజన్‌లో ప్లే ఆఫ్ రేసుకి చేరువైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో మిగిలిన పీడకలన మరిచిపోయి.. అద్భుతంగా ఆడుతూ టైటిల్ ఫెవరెట్ మారింది. అయితే ప్లేఆఫ్ చేరువైన సమయంలో ఆర్సీబీకి ఊహించని షాక్ తగిలింది. చెన్నై  సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేసర్ నవ్ దీప్ సైనీ కుడి చేతికి గాయమైంది.

సైనీ కుడి చేతి బొటన వేలికి గాయమై .. ఫీల్డ్ నుంచి బయటకి వెళ్లిపోయాడు. సైనీ బొటనవేలు, చూపుడు వేలు మధ్యలో బంతి బలంగా తగలడంతో చీలిక వచ్చిందని వైద్యులు తెలిపారు. కోలుకోవడానికి సమయం పడుతుందని తెలిపారు. అంత వరకు అతనికి రెస్ట్ ఇవ్వాలని వారు చెప్పారు. నాలుగేళ్ల క్రితం విరాట్ కోహ్లీకి కూడా ఇలాంటి గాయమై తగిలింది. అయితే ఆపరేషన్ తర్వాత కోలుకున్న విరాట్ .. భారీ సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు జరిగిన 11 మ్యాచుల్లో 5 వికెట్లు తీశాడు నవ్ దీప్ సైనీ. మంచి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ బౌలర్ గా గుర్తింపు పొందిన నవ్ దీప్ సైనీ లేక పోవడం జట్టుకు ఇబ్బందికరంగా మారనుంది.