Breaking News
  • గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న మ‌హేశ్‌. పుట్టిన‌రోజు ఇంత కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోలేన‌ని ట్వీట్‌. తార‌క్‌, విజ‌య్‌, శృతిహాస‌న్‌ను నామినేట్ చేసిన‌ మ‌హేశ్‌. ఈ కార్య‌క్ర‌మం చెయిన్ కంటిన్యూ కావాల‌ని, స‌రిహ‌ద్దులు దాటాల‌ని కోరిన మ‌హేశ్‌. ప‌చ్చ‌ద‌నం వైపు అడుగులు వేద్దామ‌న్న మ‌హేశ్‌. ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించిన మ‌హేశ్‌.
  • నిజామాబాద్ : ఎమ్మెల్సీ వీజీ గౌడ్​కు కరోనా పాజిటివ్​ . ఆయన భార్య, కుమారుడికి కూడా పాజిటివ్ నిర్ధారణ. నిమ్స్‌లో కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు వీజీ గౌడ్. హైద్రాబాద్ లో హోం క్వారంటైన్‌లో ఎమ్మెల్సీ కుటుంబం.
  • దేశవ్యాప్తంగా ఒక్క రోజులో 64,399 కరోనా కొత్త కేసులు నమోదు. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 861 మంది మృతి. దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 21,53,011. యాక్టివ్ కేసుల సంఖ్య 6,28,747, కోలుకుని డిశ్చార్జైనవారు 14,80,885. కోవిడ్-19 మహమ్మారి కారణంగా చనిపోయినవారు 43,379 మంది.
  • విజయవాడ: ఐడెంటిఫికేషన్ పూర్తి.. స్వర్ణా ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మృతి చెందిన వివరాలు... డోక్కు శివ బ్రహ్మయ్య, మచిలీపట్నం (58) పూర్ణ చంద్ర రావు.. మొవ్వ , సుంకర బాబు రావు ,సింగ్ నగర్ (రిటైర్డ్ ఎస్సై.) మజ్జి గోపి మచిలీపట్నం సువర్ణ లత పొన్నూరు, నిడుబ్రోలు వెంకట లక్ష్మి సువర్చలా దేవి,(జయ లక్ష్మి ) కందుకూరు పవన్ కుమార్ కందుకూరు..ఎం అబ్రహం.. చర్చి ఫాథర్...జగ్గయ్య పేట రాజకుమారి అబ్రహం జగ్గయ్యపేట రమేష్, విజయవాడ.
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్య శాఖ సిబ్బంది, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మె ల్సీ, మున్సిపల్ కమిషనర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లతో కోవిడ్ పై మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ లోని తన నివాసం నుంచిటెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  • భారత్-చైనా సరిహద్దుల్లో భూకంపం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1గా నమోదు చైనాలోని తూర్పు షిజాంగ్ - భారత్ సరిహద్దుల్లో భూకంప కేంద్రం.

ఎకానమీకి రిజర్వ్ బ్యాంక్ భారీ ‘ సాయం ‘.ఇక ఉజ్వల భారతమే !

RBI to transfer record of rs. 1.76 lakh crore to government, ఎకానమీకి రిజర్వ్ బ్యాంక్  భారీ ‘ సాయం ‘.ఇక ఉజ్వల భారతమే !

మోదీ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ భారీ తాయిలాన్నే ఇచ్చింది. వర్తమాన ఆర్ధిక సంవత్సరంలో రూ. 1. 76 లక్షల కోట్లను డివిడెండుగా అందజేయనుంది. ఇది గత ఫైనాన్షియల్ ఇయర్ తో పోలిస్తే రెట్టింపు నిధులు. ఈ అదనపు నిధుల సాయంతో ఆర్ధిక వ్యవస్థకు ఊపు నివ్వడానికి కేంద్రం నడుం బిగించబోతోంది. ఈ 1. 76 లక్షల కోట్లలో 28 వేల కోట్లను ఇదివరకే ప్రభుత్వానికి బ్యాంక్ బదలాయించింది. ఇక రూ. 1. 48 లక్షల కోట్లను ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ట్రాన్స్ ఫర్ చేయనున్నారు. దీంతో ముఖ్యంగా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు మరిన్ని ఫండ్స్ సమకూర్చేందుకు వీలవుతుంది. మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల ఆధారంగా ఈ భారీ డివిడెండ్ ప్రభుత్వానికి దక్కుతోంది. దేశ ఆర్ధిక వ్యవస్థ ఒడిదుడుకులతో కొనసాగుతున్న వేళ.. వృద్ది రేటు క్రమేపీ క్షీణిస్తున్న సమయంలో, వివిధ రంగాల్లో ఉద్యోగాల ఉద్వాసన జరుగుతున్నఈ సమయంలో రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం నిజంగా మోదీ సర్కార్ కు భారీ ఊరటే. ఈ నిధుల బదిలీలో కొన్ని ముఖ్యమైన అంశాలు..

ఆర్బీఐ మిగులు నిధుల్లో రూ. 52, 640 కోట్లున్నాయి. ఈ మొత్తంలో 28 వేల కోట్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వానికి బదలాయించారు. నిజానికి ఆర్బీఐ నుంచి 90 వేల కోట్ల డివిడెండ్ రావచ్చునని ప్రభుత్వం తన తాజా బడ్జెట్లో అంచనా వేసింది. కానీ దానికి మించి నిధులను అందుకుంది. వచ్ఛే ఏడాది మార్చి వరకు మెల్లగా నిధులను విడుదల చేసే బదులు.. తక్షణమే రూ. 70 వేల కోట్లను బ్యాంకులకు రిలీజ్ చేయనున్నామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అలా ప్రకటన చేసిన కొన్ని రోజులకే ఆర్బీఐ ఈ చర్య తీసుకుంది. కరెన్సీ నోట్ల ముద్రణ, నాణేల తయారీలో తను పెట్టిన పెట్టుబడులనుంచి వఛ్చిన లాభాల నేపథ్యంలో ఆర్బీఐ ప్రతి ఏడాది డివిడెండ్ చెల్లిస్తోంది. తన వార్షిక నివేదికలో భాగంగా ఈ బ్యాంకు తన బ్యాలన్స్ షీట్ ను ఈ వారాంతంలో విడుదల చేయనుంది.

రిజర్వ్ బ్యాంకు వద్ద దానికి అవసరమైన దానికన్నా ఎక్కువ మూలధనం ఉందని కేంద్రం భావిస్తోంది. ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై అత్యధిక పన్నులను ఉపసంహరిస్తున్నట్టు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించారు. ఇన్వెస్టర్ సెంటిమెంటును పెంచే యత్నంలో భాగంగా లాంగ్, షార్ట్ టర్మ్ కేపిటల్ గెయిన్స్ పై సర్చార్జీ విధింపు గురించి కూడా ఆమె ప్రస్తావించారు. ఏమైనా.. ఆర్బీఐ తీసుకున్న తాజా చర్య ఫలితం సెన్సెక్స్, స్టాక్ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related Tags