ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. మార‌నున్న చెక్ చెల్లింపుల నిబంధ‌న‌లు.. జ‌న‌వ‌రి 1 నుంచి ‘పాజిటివ్ పే సిస్ట‌మ్‌’

చెక్ చెల్లింపుల కోసం కొత్త రూల్స్ రానున్నాయి. వీటిని ఆర్బీఐ ఆగ‌స్టు నుంచి అమ‌లు చేయ‌డానికి ప్లాన్ చేయ‌గా, చివ‌రిగా జ‌న‌వ‌రి 1, 2021 నుంచి అమ‌ల్లోకి రానుంది. ఈ మేర‌కు ఆర్బీఐ పాజిటీవ్ పే సిస్ట‌మ్

ఆర్బీఐ కీల‌క నిర్ణ‌యం.. మార‌నున్న చెక్ చెల్లింపుల నిబంధ‌న‌లు.. జ‌న‌వ‌రి 1 నుంచి 'పాజిటివ్ పే సిస్ట‌మ్‌'
Follow us

|

Updated on: Dec 13, 2020 | 4:18 PM

చెక్ చెల్లింపుల కోసం కొత్త రూల్స్ రానున్నాయి. వీటిని ఆర్బీఐ ఆగ‌స్టు నుంచి అమ‌లు చేయ‌డానికి ప్లాన్ చేయ‌గా, చివ‌రిగా జ‌న‌వ‌రి 1, 2021 నుంచి అమ‌ల్లోకి రానుంది. ఈ మేర‌కు ఆర్బీఐ పాజిటీవ్ పే సిస్ట‌మ్ ద్వారా చెక్ పేమెంట్ చేయ‌డానికి అంగీక‌రించింది. దీని కింద రూ.50 వేల‌కుపైగా ఉన్న చెక్కుల‌ను అవ‌స‌ర‌మైన స‌మాచారం మ‌ళ్లీ నిర్ధారించ‌నున్నారు. చెక్ చెల్లింపుల కోసం ఈ కొత్త నిబంధ‌న‌లు జ‌న‌వ‌రి 1 నుంచి అమ‌ల్లోకి రానున్నాయి. ఈ విధానం వ‌ల్ల చెక్ చెల్లింపుల‌ను సుర‌క్షితం చేయ‌డంతో పాటు బ్యాంకు మోసాల‌ను అరిక‌ట్టేందుకు ఈ కొత్త నియ‌మాల‌ను రూపొందించారు.

అయితే కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. చెక్కుల‌ను జారీ చేసే వ్య‌క్తి చెక్ తేదీని ఎల‌క్ట్రానిక్ ప‌ద్ద‌తిలో గ్ర‌హిత పేరు, చెల్లింపు మొత్తాన్ని తిరిగి తెలియ‌జేయాల్సి ఉంటుంది. చెక్ జారీ చేసే వ్య‌క్తి ఎస్ ఎంఎస్‌, మొబైల్ యాప్‌, ఇంట‌ర్నెట్ బ్యాకింగ్‌, ఏటీఎం వంటి ఎల‌క్ట్రానిక్ మార్గాల ద్వారా ఈ స‌మాచారాన్ని అందించ‌వ‌చ్చు. చెక్ చెల్లింపున‌కు ముందు ఈ వివ‌రాల‌ను బ్యాంకు సిబ్బంది క్రాస్ చెక్ చేసుకుంటారు. ఏదైనా లోపం ఉన్న‌ట్ల‌యితే అది చెక్ ట్రంకేష‌న్ సిస్టం ద్వారా గుర్తించి స‌మాచారాన్ని చెక్ చెల్లింపు చేయాల్సిన బ్యాంకు, చెక్ జారీ చేసిన బ్యాంకుల‌కు అందుతుంది.రూ.50 వేలు.. అంత‌కంటే ఎక్కువ చెల్లింపు విష‌యంలో బ్యాంకులు ఖాతాదారుల‌కు ఈ కొత్త నిబంధ‌న‌లు వ‌ర్తించ‌నున్నాయి.

ఈ స‌దుపాయాన్ని పొందాల‌ని ఖాతాదారుడు నిర్ణ‌యించుకోవాల్సి ఉంటుంది. కాగా, రూ.5 ల‌క్ష‌లు, అంత‌కంటే ఎక్కువ విలువ చేసే చెక్కుల విష‌యంలో బ్యాంకులు ఈ నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌ని స‌రి చేయ‌వ‌చ్చు. నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ఈ వ్య‌వ‌స్థ‌ను డెవ‌ల‌ప్ చేసి అన్ని బ్యాంకుల‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.