వడ్డీ రేట్లు యథాతథం, హోం, ఆటో లోన్ లబ్ధిదారుల ఊసెత్తని రిజర్వ్ బ్యాంక్, రెపో రేటు 4 శాతం

రిజర్వ్  బ్యాం క్ శుక్రవారం ప్రకటించిన  తన ద్వైమాసిక మానిటరీ పాలసీలో గృహ, ఆటో రుణ లబ్దరులకు ఎలాంటి 'వరాలను' ప్రస్తావించలేదు.  ఈ రంగాలకు సంబంధించి ఈ ఎం ఐ ల జోలికి పోలేదు.

వడ్డీ రేట్లు యథాతథం, హోం, ఆటో లోన్ లబ్ధిదారుల ఊసెత్తని రిజర్వ్ బ్యాంక్,  రెపో రేటు 4 శాతం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 04, 2020 | 12:09 PM

రిజర్వ్  బ్యాం క్ శుక్రవారం ప్రకటించిన  తన ద్వైమాసిక మానిటరీ పాలసీలో గృహ, ఆటో రుణ లబ్దరులకు ఎలాంటి ‘వరాలను’ ప్రస్తావించలేదు.  ఈ రంగాలకు సంబంధించి ఈ ఎం ఐ ల జోలికి పోలేదు. వరుసగా మూడోసారీ కీలక వడ్డీ రేట్లను యధాతథంగా ఉంచుతున్నామని ఆర్ బీ ఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. పెరిగిన ద్రవ్యోల్బణం, కరోనా వైరస్ నేపథ్యంలో రెపో రేటును 4 శాతానికి పరిమితం చేసినట్టు ఆయన చెప్పారు. గత మే నెల నుంచి ఈ రేటును 19 ఏళ్ళ క్రితం ఉన్నట్టే నిర్దేశించినట్టు ఆయన చెప్పారు. రివర్స్ రేటు 3.35 శాతంగా, బ్యాంకు  రేటు  4.25 శాతంగా ఉంది. ఆర్థిక వృద్దిని బలోపేతం చేయడానికి అకామడిసిటీస్ మానిటరీ పాలసీ విధానాన్ని కొనసాగిస్తామని శక్తికాంత దాస్ చెప్పారు. ఫైనాన్షియల్ సిస్టం లో డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు తమ బ్యాంక్ కట్టుబడి ఉందన్నారు.

2020-21 ఆర్ధిక వృద్ది అంచనాలను సవరించిన ఆర్ బీ ఐ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ది రేటు9.5 శాతం నుంచి 7.5 శాతం ఉండవచ్ఛునని పేర్కొంది. రికవరీ పాథ్ లో మరిన్ని రంగాలు చేరుతున్నందున ఆర్ధిక వ్యవస్థ మెల్లగా కోలుకుంటోందని శక్తికాంత దాస్ చెప్పారు. కాగా ఇటీవలే దేశంలో  క్రమంగా ఆర్థిక  మాంద్యం ఏర్పడుతోందని వార్తలు వచ్చిన వేళ..రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చేసిన ఈ తాజా ప్రకటన మళ్ళీ ఎకానమీ పుంజుకోగలదన్న ఆశలకు బాటలు వేస్తున్నాయి.