పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. కీలక వడ్డీ రేట్లు యధాతథం: ఆర్బీఐ గవర్నర్

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. ఈ క్రమంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్

పెరుగుతున్న ద్రవ్యోల్బణం.. కీలక వడ్డీ రేట్లు యధాతథం: ఆర్బీఐ గవర్నర్
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2020 | 2:02 PM

కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్ని కుదేలయ్యాయి. ఈ క్రమంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేదని ఆర్బీఐ ప్రకటించింది. ఇవాళ జరిగిన ద్రవ్య పరపతి విధాన సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ మేరకు ప్రకటించారు. రెపో రేటు 4 శాతం, రివ‌ర్స్ రెపో రేటును 3.3 శాతంగానే ఉంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. బ్యాంకులకు ఇచ్చే రుణాల నుంచి ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటును రెపోరేటు అని.. బ్యాంకులకు ఆర్బీఐ చెల్లించే వడ్డీ రేటును రివర్స్ రెపోరేటు అని అంటారు.

మరోవైపు.. రెపోరేటు తగ్గిస్తే వచ్చే లాభాలను తమ వినియోగదారులకు బదలాయించవచ్చునని బ్యాంకులు ఆశిస్తాయి. తద్వారా గృహ, వాహన రుణాలు సహా ఇతర రుణాలపై వడ్డీ భారం తగ్గి ఈఎంఐల భారం తగ్గుతుంది. ఈ సారి వడ్డీరేట్లను ఆర్బీఐ కనీసం 25 బేస్ పాయింట్లు తగ్గిస్తుందని వ్యాపార వర్గాలు ఆశించాయి. నేషనల్ హౌసింగ్ బ్యాంకు (ఎన్‌హెచ్‌బీ), నాబార్డ్‌ల (జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు) ద్వారా అదనంగా మరో రూ.10 వేల కోట్ల మేర నగదు లభ్యతను అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ పేర్కొన్నారు. కరోనా కల్లోలంతో కుంటుపడిన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

Read More:

తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం.. 21 రోజుల్లో ఇంటి అనుమతులు..!

దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ!