బ్రేకింగ్.. మ్యూచువల్ ఫండ్స్ కి మళ్ళీ ‘ప్రాణం’.. రూ. 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు.. రిజర్వ్ బ్యాంక్

ఇండియాలోని 6 డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్' ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీని ప్రకటించింది...

బ్రేకింగ్.. మ్యూచువల్ ఫండ్స్ కి మళ్ళీ 'ప్రాణం'.. రూ. 50 వేల కోట్ల ప్రత్యేక నిధులు.. రిజర్వ్ బ్యాంక్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 27, 2020 | 12:50 PM

ఇండియాలోని 6 డెట్ ఫండ్లను మూసివేస్తూ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ మ్యూచువల్ ఫండ్ తీసుకున్న నిర్ణయానికి భారత రిజర్వ్ బ్యాంక్ కౌంటర్’ ఇచ్చింది. మ్యూచువల్ ఫండ్ల కోసం రూ. 50 వేల కోట్ల స్పెషల్ లిక్విడిటీ ఫెసిలిటీని ప్రకటించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఇన్వెస్టర్లకు సంబంధించిన రూ. 38 వేల కోట్లకు పైగా సొమ్ము లాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్రం ఏదో ఒక చర్య తీసుకోవాలని, లేని పక్షంలో మన దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.

ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచేందుకు తీసుకున్నఈ సౌలభ్యం సోమవారం నుంచి మే 11 వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో ఎం ఎఫ్ లపై లిక్విడిటీ ఒత్తిడిని తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ ఆర్ బీ ఐ తీసుకుంది. ఎస్ ఎల్ ఎఫ్-ఎం ఎఫ్ కింద 90 రోజుల వ్యవధిలో రెపో కార్యకలాపాలను నిర్ణీత రెపో రేటులో నిర్వహిస్తామని బ్యాంకు తెలిపింది. సోమవారం నుంచి మే 11 వరకు లేదా కేటాయించిన మొత్తానికి అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. బ్యాంకులు రిజర్వ్ బ్యాంకు నుంచి రెపో విండోలో ఫండ్స్ ని యాక్సెస్ చేసుకోవచ్ఛు. ఎస్ఎల్ఎఫ్.. ఎంఎఫ్ కింద లభించే లిక్విడిటీ సపోర్ట్ హెచ్టీఎం పోర్టుఫోలియోలో చేర్చడానికి అనుమతించిన మొత్తం పెట్టుబడిలో ఇరవై అయిదు శాతానికి మించి మెచ్యూరిటీ ఉంటుందని కూడా బ్యాంకు పేర్కొంది. ఈ దశలో హై రిస్క్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కి మాత్రమే స్ట్రెస్ ఉంటుందని, ఇతర మ్యూచువల్ ఇండస్ట్రీ లిక్విడిటీలో ఉంటుందని వెల్లడించింది.

రిజర్వ్ బ్యాంకు తాజా నిర్ణయంపట్ల  మ్యూచువల్ ఫండ్ కంపెనీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ షేర్లలో మెరుగైన వృద్ది కనిపించింది. మార్చి మాసాంతానికి 86 వేల కోట్లకు పైగా విలువైన ఆస్తులతో ఫ్రాంక్లిన్ టెంపుల్ట్రన్ దేశంలో అతి పెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థగా పాపులర్ అయింది. రెండు దశాబ్దాల క్రితం ఇది ఏర్పాటైంది.

కాగా… రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాన్నిపి. చిదంబరం స్వాగతించారు. రెండు రోజుల క్రితం తాను వెలిబుచ్చిన ఆందోళన నేపథ్యంలో సకాలంలో బ్యాంకు ఈ నిర్ణయాన్ని తీసుకుందంటూ ఆయన ట్వీట్ చేశారు.

రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
టాస్ ఓడిన ఢిల్లీ.. వార్నర్ ప్లేస్‌లో విండీస్ స్టార్ ప్లేయర్
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
సన్‌రైజర్స్ కావ్య పాప ఆస్తి ఇన్ని కోట్లా.? లెక్కలు చూస్తే చుక్కలే
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
మరో అమ్మాయితో పెళ్లికి ప్రియుడు రెడీ.. పగ తీర్చుకున్న ప్రియురాలు
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
పార్లమెంట్‌ ఎన్నికల్లో హీరో ఎవరు? జీరో ఎవరు?
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
ఎండుద్రాక్షను నానబెట్టిన నీటితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా ??
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
భారీగా రెమ్యునరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఒక్క సినిమాకు అన్ని కోట్లా
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
టీమ్ నుంచి దొబ్బేయ్! 14 కోట్ల ప్లేయర్‌పై CSK ఫ్యాన్స్ ట్రోలింగ్
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..
ప్రమాదానికి గురైన కేసీఆర్ కాన్వాయ్.. తప్పిన పెను ప్రమాదం..