రవీంద్ర జడేజా బొటన వేలికి శస్త్రచికిత్స.. చివరి టెస్టు నుంచి ఔట్.. జడ్డు స్థానంలో ఎవరో..

సిడ్నీ టెస్టు సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజాకు మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బోన్ ఫ్యాక్చర్ అవడంతో బొటన వేలిని...

  • Sanjay Kasula
  • Publish Date - 3:14 pm, Wed, 13 January 21
రవీంద్ర జడేజా బొటన వేలికి శస్త్రచికిత్స.. చివరి టెస్టు నుంచి ఔట్.. జడ్డు స్థానంలో ఎవరో..

Ravindra Jadeja : సిడ్నీ టెస్టు సందర్భంగా గాయపడిన రవీంద్ర జడేజాకు మంగళవారం శస్త్రచికిత్స జరిగింది. బోన్ ఫ్యాక్చర్ అవడంతో బొటన వేలిని డాక్టర్లు సరిచేశారు. ఈ విషయాన్ని జడేజా తన సోషల్​మీడియాలో వెల్లడిస్తూ.. ఓ ఫొటోను షేర్​ చేశాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమిండియా ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా బొటన వేలికి గాయమైన కారణంగా.. చివరి టెస్టు నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జడేజాకు ఎడమచేతి బొటనవేలికి శస్త్రచికిత్స జరిగింది. ఈ విషయాన్ని సోషల్​మీడియాలో వెల్లడించాడు.