‘డిస్కో రాజా’ మూవీ రివ్యూ

సినిమా: డిస్కో రాజా నిర్మాణ సంస్థ: ఎస్‌ఆర్‌ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ నటీనటులు: రవితేజ, పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్‌, బాబీ సింహా, సునీల్‌, వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌, జీవా, సత్యం రాజేష్‌, రామ్‌కీ, రఘుబాబు, అన్నపూర్ణ, గిరిబాబు, శిశిర్‌శర్మ, నరేష్‌, భరత్‌ రెడ్డి, సీవీఎల్‌ నరసింహారావు, ముస్కాన్‌ అరోరా తదితరులు రచన: వి.ఐ.ఆనంద్‌ సంబాషణలు: అబ్బూరి రవి సంగీతం: తమన్‌ కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని ఎడిటింగ్‌: శ్రావణ్‌ కటికనేని దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌ నిర్మాతలు: […]

'డిస్కో రాజా'  మూవీ రివ్యూ
Follow us

|

Updated on: Jan 24, 2020 | 5:15 PM

సినిమా: డిస్కో రాజా నిర్మాణ సంస్థ: ఎస్‌ఆర్‌ టి ఎంటర్‌టైన్‌మెంట్స్ నటీనటులు: రవితేజ, పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌, తాన్యా హోప్‌, బాబీ సింహా, సునీల్‌, వెన్నెల కిశోర్‌, సత్య, అజయ్‌, జీవా, సత్యం రాజేష్‌, రామ్‌కీ, రఘుబాబు, అన్నపూర్ణ, గిరిబాబు, శిశిర్‌శర్మ, నరేష్‌, భరత్‌ రెడ్డి, సీవీఎల్‌ నరసింహారావు, ముస్కాన్‌ అరోరా తదితరులు రచన: వి.ఐ.ఆనంద్‌ సంబాషణలు: అబ్బూరి రవి సంగీతం: తమన్‌ కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని ఎడిటింగ్‌: శ్రావణ్‌ కటికనేని దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌ నిర్మాతలు: రామ్‌ తాళ్లూరి, రజనీ తాళ్లూరి విడుదల: 24.01.2020

రవితేజకి ఇప్పుడు అర్జంటుగా ఓ హిట్‌ కావాలి. ఆ హిట్టు కోసం ఆయన కొత్త జోనర్‌ని ట్రై చేశారు. సై ఫై థ్రిల్లర్‌ని అటెంప్ట్ చేశారు. తండ్రీ, కొడుకూ ఒకే వయసులో ఉంటే ఏమవుతుంది? అసలు అలా ఉండటం సాధ్యమేనా? అసలు ఉంటే… ఎలా ఉన్నట్టు?… వంటి ఆసక్తికరమైన లైన్‌తో తెరకెక్కింది డిస్కో రాజా. రెట్రో లుక్స్, బాలు పాట, మంచులో ఫైట్‌.. ఇలా ఇంట్రస్టింగ్‌గా సాగుతుందీ సినిమా. మరి ఇంతకీ రవితేజ ఆశించిన హిట్‌ అందిందా? లేదా?…

కథ వాసు (రవితేజ)కి ఓ పెద్ద కుటుంబం ఉంటుంది. అయితే అది అతని సొంత ఫ్యామిలీ కాదు. అనాథలందరూ కలిసి ఓ ఫ్యామిలీగా ఉంటారు. వారి అవసరాల కోసం వాసు కష్టపడుతుంటాడు. ఉన్నట్టుండి వాసు కనిపించకుండా పోతాడు. అతని కోసం అతని ప్రేయసి నభా (నభా నటేష్‌) కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటుంది. అదే సమయంలో ఓ డాక్టర్‌ ట్రూప్ కి మంచు కొండల్లో ఓ డెడ్‌బాడీ దొరుకుతుంది. అతన్ని తీసుకొచ్చి ల్యాబ్‌లో పెట్టి మళ్లీ ఊపిరిపోస్తారు. ప్రాణాన్ని తిరిగి తేగలుగుతారు కానీ, అతనికి గతం గుర్తురాదు. కానీ కాలక్రమేణ గతం గుర్తుకొస్తుంది. తన పేరు డిస్కోరాజా (రవితేజ) అని తెలుసుకుంటాడు. అతని జీవితంలో హెలెన్‌ (పాయల్‌ రాజ్‌పుత్‌) వల్ల చోటుచేసుకున్న మార్పులేంటి? సేతు (బాబీ సింహా) ఎవరు? అతనికీ, డిస్కో రాజాకీ మధ్య ఉన్న సంబంధం ఏంటి? వారి మధ్య వైరం ఎందుకొచ్చింది? ఆంటోని ఎవరు? ఉత్తమ్‌ కుమార్‌ లో భయం నిజమేనా? భార్య కోరిక మేరకు లడఖ్‌ వెళ్లిన డిస్కోరాజా జీవితం ఎలాంటి మార్పులకు గురయింది? డిస్కోరాజాని, సేతుని మోసం చేసి లాభపడింది ఎవరు? డిస్కోరాజా, అతని కుమారుడు వాసు ఒకే వయసులో ఉండటానికి కారణం ఏంటి? వంటివన్నీ ఆసక్తికరం. ప్లస్‌ పాయింట్లు – తండ్రీ కొడుకు ఒకే వయసులో ఉండటమనే ఆలోచన – ఓపెనింగ్‌ సీన్స్, కొన్ని ఫైట్లు, క్లైమాక్స్ – నటీనటుల పెర్ఫార్మెన్స్ మైనస్‌ పాయింట్లు – సైఫై సబ్జెక్టులో పాత ఫార్ములా – రొటీన్‌ సన్నివేశాలు – ఎడిటింగ్‌ సమీక్ష తండ్రీ కొడుకు ఒకే వయసుతో కనిపించడం అనే కాన్సెప్ట్ రవితేజనే కాదు, విన్న ఎవరినైనా అట్రాక్ట్ చేస్తుంది. రవితేజ కూడా ఆ పాయింట్‌ మీదే కథను ఓకే చేసి ఉండవచ్చు. అంత వరకు బాగానే ఉంది. కానీ సన్నివేశాలు రాసుకోవడంలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. వాసుని కిడ్నాప్‌ చేసిందెవరు. అందుకు బలమైన కారణాలు ఏంటి అనే విషయం మీద స్పష్టత పెద్దగా ఉండదు. బలమైన విలన్లుగా ఎస్టాబ్లిష్ అయిన డిస్కోరాజాను, సేతును తమ దగ్గర ఉన్న వ్యక్తి మోసం చేయడం అనేది ఒకింత కొత్తగా అనిపిస్తుంది. క్లైమాక్స్ లో ఉండే ఆ థ్రిల్ అంతకు ముందు వచ్చే సన్నివేశాల్లో ఉండదు. తన దగ్గరున్న పేషెంట్‌తో లేడీ డాక్టర్‌ ప్రవర్తించే విధానం కూడా సహజత్వానికి దూరంగా ఉంటుంది. డబుల్‌ యాక్షన్‌లో రవితేజ బావున్నారు. రెట్రో లుక్స్ కూడా బావున్నాయి. కెమెరా సినిమాకు మంచి ప్లస్‌ అయింది. సినిమా కోసం నిర్మాత పెట్టిన ఖర్చు స్క్రీన్‌ మీద స్పష్టంగా కనిపిస్తుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త పదునుగా ఉండాల్సింది. పాయల్‌ రాజ్‌పుత్‌ ఇప్పటిదాకా చేసిన సినిమాలు వేరు. ఇందులో వేరు. ఈ సినిమాలో ఆమె పెర్ఫార్మెన్స్ బావుంది. నభాకి నటించే అవకాశాలు పెద్దగా లేవు. షర్ట్ వేసుకుని కనిపించే సన్నివేశాలు కేవలం కుర్రకారును ఆకట్టుకోవడానికి మాత్రమే అన్నట్టుంటాయి. స్క్రీన్‌ప్లే కొత్తగా అనిపించినా… సన్నివేశాలను రిజిస్టర్‌ చేయడంలో ఫెయిల్‌ అయినట్టు అనిపిస్తుంది. ఓ ఇన్సిడెంట్‌లో కాస్త కాన్‌సెన్‌ట్రేట్‌ చేస్తున్నామనే భావన కలుగుతున్న క్రమంలో వెంటనే అక్కడ సీన్‌ కట్‌ కావడం ప్రేక్షకుడికి విసుగు తెప్పిస్తుంది. బాలు పాడిన పాట, ధిల్లీవాలా బావున్నాయి. మిగిలినవి పెద్దగా ఆకట్టుకోవు. ఎంత ఎయిటీస్‌కి సంబంధించిన సబ్జెక్ట్ అయితే మాత్రం పూర్తిగా తెలుగులో జరిగే కథకు మొత్తం హిందీ పాటలు పెట్టడం ఏంటోగా ఉంది. ఆ సమయంలో తెలుగు నాట ప్రజాదరణ పొందిన పాటలు చాలా చాలానే ఉన్నాయన్న సంగతి మర్చిపోకూడదు. తెలుగు, తమిళ్‌, హిందీ అంటూ… కలివిడిగా సాగిన సన్నివేశాలతో… ఏదీ సరిగ్గా మనస్సును హత్తుకోదు. ఆఖరిగా… పాయింట్‌ ఓకే .. పాత పగేంటి రాజా!

డా. చల్లా భాగ్యలక్ష్మి