విలియంసన్ నాయకత్వం అమోఘం: రవిశాస్త్రి

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియంసన్ పై టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. విలియంసన్ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌ చేజారినప్పటికీ కివీస్‌ కెప్టెన్‌ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. ‘క్లిష్టపరిస్థితుల్లోనూ నువ్వు చూపిన సహనం, గౌరవం ప్రశంసాయోగ‍్యం. తుది సమరం ముగిసిన తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అపూర్వం. ప్రపంచకప్‌ టైటిల్‌ తృటిలో చేజారినప్పటికీ మా దృష్టిలో మీరు కూడా విజేతలే. నువ్వు […]

విలియంసన్ నాయకత్వం అమోఘం: రవిశాస్త్రి
Follow us

| Edited By:

Updated on: Jul 17, 2019 | 6:03 PM

న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియంసన్ పై టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. విలియంసన్ నాయకత్వాన్ని, హుందాతనాన్ని మెచ్చుకున్నాడు. దురదృష్టవశాత్తు ప్రపంచకప్‌ చేజారినప్పటికీ కివీస్‌ కెప్టెన్‌ గౌరవంగా ఫలితాన్ని అంగీకరించి క్రీడాస్ఫూర్తిని చాటాడని పేర్కొన్నాడు. ‘క్లిష్టపరిస్థితుల్లోనూ నువ్వు చూపిన సహనం, గౌరవం ప్రశంసాయోగ‍్యం. తుది సమరం ముగిసిన తర్వాత 48 గంటల పాటు నువ్వు పాటించిన మౌనం అపూర్వం. ప్రపంచకప్‌ టైటిల్‌ తృటిలో చేజారినప్పటికీ మా దృష్టిలో మీరు కూడా విజేతలే. నువ్వు సమర్థుడైన ఆటగాడివి’ అంటూ రవిశాస్త్రి ట్వీట్‌ చేశాడు.

కాగా…విలియంసన్ ‘ఈ తరహాలో పరాజయం పాలవుతామని ఊహించలేదని’ అన్నాడే తప్ప ఆగ్రహించలేదు. బౌండరీ లెక్క ప్రకారం ఫలితం రావడం జీర్ణించుకోలేకపోతున్నామని నిరాశ వ్యక్తం చేశాడు. ఫలితం తమకు ప్రతికూలంగా వచ్చినప్పటికీ ఎవరిపైనా విమర్శలు చేయకుండా హుందాగా ప్రవర్తించాడు. మ్యాచ్‌ అద్భుతంగా జరిగిందని, అందరూ దానిని బాగా ఆస్వాదించారని పేర్కొన్నాడు.