జనసేనకి రావెల కిషోర్ బాబు గుడ్ బై

Ravela Kishore Babu quits Janasena, జనసేనకి రావెల కిషోర్ బాబు గుడ్ బై

జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. జనసేన పార్టీకి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు తెలుపుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కి ఆయన లేఖ రాశారు. 2014లో తొలిసారిగా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన అనూహ్యంగా మంత్రి పదవిని దక్కించుకున్నప్పటికీ.. పనితీరు పట్ల పార్టీలో వ్యతిరేకత రావడంతో చంద్రబాబు నాయుడు మంత్రి పదవి నుంచి తప్పించారు. రావెల వైసీపీలో చేరతారని మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ ఆయన జనసేన గూటికి చేరారు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసిన రావెల భవిష్యత్ కార్యచరణపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అంతకు ముందు తంబలపల్లికి చెందిన జనసేన పార్టీ అభ్యర్థి విశ్వం ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *