కరోనా లాక్‌డౌన్: ఉచిత రేషన్ బియ్యం పంపిణీ

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి 12 కిలోల ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాలు.. గ్రామాలలోని రేషన్ షాపులకు బియ్యం చేరుకుందని వెల్లడించారు. 1103 కోట్లతో 3 లక్షల 36 వేల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. 87 లక్షల 59 […]

కరోనా లాక్‌డౌన్: ఉచిత రేషన్ బియ్యం పంపిణీ
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2020 | 6:37 PM

కొవిడ్‌-19 ప్రపంచ దేశాలతో పాటు భారత్ నూ గడగడలాడిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో రేపటి నుంచి 12 కిలోల ఉచిత రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాలు.. గ్రామాలలోని రేషన్ షాపులకు బియ్యం చేరుకుందని వెల్లడించారు. 1103 కోట్లతో 3 లక్షల 36 వేల మెట్రిక్ టన్నుల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా.. 87 లక్షల 59 వేల కార్డుల లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రేషన్ షాప్‌ల దగ్గర జనాలు గుమికూడకుండా ఉదయం కొంత మందికి.. సాయంత్రం కొంతమందికి టోకెన్‌ల ద్వారా బియ్యం పంపిణీ చేయనున్నట్టు వెల్లడించారు. ఇతరులకు సోకకుండా లబ్ధిదారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 1500 రూపాయలను డైరెక్ట్‌గా లబ్ధిదారుల ఖాతాలో వేస్తుందని… ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులు తెలిపారు.