రష్మిక తొందరపాటు.. మూవీ టైటిల్ లీక్

తెలుగు, తమిళంలో వరుస విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ల సరసన చేరిన రష్మిక మందన్న ఇప్పుడు తమిళ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. కార్తీ హీరోగా బక్కియరాజ్ కన్నన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ద్వారా ఈ బ్యూటీ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ మూవీ ఆ మధ్యన సెట్స్ మీదకు వెళ్లగా.. తాజాగా షూటింగ్‌లో పాల్గొంది రష్మిక. అయితే అంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ షూటింగ్ విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్న రష్మిక […]

రష్మిక తొందరపాటు.. మూవీ టైటిల్ లీక్
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 5:16 PM

తెలుగు, తమిళంలో వరుస విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ల సరసన చేరిన రష్మిక మందన్న ఇప్పుడు తమిళ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. కార్తీ హీరోగా బక్కియరాజ్ కన్నన్ తెరకెక్కిస్తోన్న చిత్రం ద్వారా ఈ బ్యూటీ కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ఇక ఈ మూవీ ఆ మధ్యన సెట్స్ మీదకు వెళ్లగా.. తాజాగా షూటింగ్‌లో పాల్గొంది రష్మిక. అయితే అంతవరకు బాగానే ఉంది కానీ.. ఈ షూటింగ్ విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకున్న రష్మిక ఆ తొందరపాటులో టైటిల్‌ను రివీల్ చేసింది. ‘‘సుల్తాన్ నాలుగో రోజు. నా లుక్‌ను చూడాలనుకోకండి’’ అంటూ ఆమె కామెంట్ పెట్టింది.

కాగా ఈ మూవీకి ‘సుల్తాన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో వార్తలు రాగా.. చిత్ర యూనిట్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇప్పుడు రష్మిక లీక్ చేయడంతో అదే కార్తీ మూవీ టైటిల్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు. మరోవైపు టైటిల్‌ను లీక్ చేయడంతో ఆమెపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పడుతున్నాయి.

ఇదిలా ఉంటే తెలుగులో ఈ సంవత్సరం ‘డియర్ కామ్రేడ్‌’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక.. ప్రస్తుతం మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తోంది. ఈ మూవీతో పాటు బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీలోనే రష్మికనే హీరోయిన్‌గా ఖరారు అయింది.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు