Breaking News
  • అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశారు. న్యాయం చేయమని రోడ్డుపైకి వచ్చిన మహిళను అరెస్ట్ చేస్తున్నారు. మహిళలపై లాఠీచార్జ్‌ దారుణం-నారా లోకేష్‌. మండలిలో రేపు ఏం జరుగుతుందో ప్రజలే చూస్తారు-లోకేష్‌.
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఎన్నిక సంతోషకరం. తెలంగాణ తరపున అభినందనలు తెలిపాం. తెలంగాణపై దృష్టిపెట్టాలని కోరాం-టీఎస్‌ బీజేపీ చీఫ్‌ డా.లక్ష్మణ్‌. త్వరలో తెలంగాణలో జేపీ నడ్డా పర్యటిస్తారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఒక గూటి పక్షులే-డా.లక్ష్మణ్‌.
  • అమరావతి: పవన్‌తో పోలీసుల మంతనాలు. రాజధాని గ్రామాల పర్యటన వాయిదా వేసుకోవాలంటున్న పోలీసులు.
  • కరీంనగర్‌లో గంజాయి ముఠా గుట్టురట్టు. రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత. ముగ్గురు అరెస్ట్‌, ట్రక్‌ స్వాధీనం.
  • చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత. అబుదాబి నుంచి చెన్నైకి తరలిస్తున్న 3.7 కేజీల బంగారం పట్టివేత. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు.

సంచలన పాత్రకు ఓకే చెప్పిన రష్మి..? పెద్ద సాహసమే చేస్తోందా..!

Rashmi Gautam entry into Web Series, సంచలన పాత్రకు ఓకే చెప్పిన రష్మి..? పెద్ద సాహసమే చేస్తోందా..!

హాట్ యాంకర్‌ రష్మికి యూత్‌లో ప్రత్యేక క్రేజ్ ఉంది. ఈమె నటించిన సినిమాలేవీ పెద్దగా ఆడకపోయినా.. బుల్లితెరపై మాత్రం ఈ అమ్మడు వరుస షోలతో దూసుకుపోతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. అక్కడ హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను కనువిందు చేస్తూ ఉంటుంది. అంతేకాదు అభిమానులతో అప్పుడప్పుడు చాట్ చేస్తూ వారికి మరింత దగ్గరగా ఉంటుంది రష్మి. ఇదిలా ఉంటే ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు వెబ్‌ సిరీస్‌లోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అన్ని భాషల్లోనూ వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. వీటికి మంచి డిమాండ్‌ ఉండటంతో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలన్నీ సొంత వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్నాయి. ఇక అందులో నటించేందుకు టాప్ హీరో, హీరోయిన్లు సైతం ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలో రష్మీ కూడా ఓ వెబ్‌సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పిందట. అయితే అందులో రష్మీ ఏ పాత్ర చేయబోతోందో తెలుసా..? లెస్బియన్. ఈ పాత్ర గురించి విన్న రష్మీ.. వెంటనే ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? లెస్బియన్ పాత్రలో రష్మి ఏ మేరకు మెప్పిస్తుంది..? ఏఏ భాషల్లో ఆ వెబ్‌ సిరీస్ రానుంది..? అనే వివరాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.

అయితే ఇలాంటి పాత్రలు చేయడమన్నది అంత ఈజీ కాదు. ఇందుకోసం శారీరకంగా కాకపోయినా.. మానసికంగా శ్రమించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హావభావాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి నేపధ్యంలో ఈ పాత్రకు ఒప్పుకొని రష్మి పెద్ద సాహసమే చేస్తుందని చెప్పొచ్చు. కాగా వెండితెరపై నిత్యా మీనన్, రెజీనా ఇప్పటికే లెస్బియన్ పాత్రలలో నటించారు. ‘అ!’ సినిమాలో నిత్యామీనన్, ‘ఏక్ లడ్కీ కీ దేఖా’ తో ఐసా లగా అనే హిందీ చిత్రంలో రెజీనా ఆ పాత్రలలో నటించిన విషయం తెలిసిందే.