బిగ్ బాస్: బెడ్ షేరింగ్ టాస్క్‌.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు!

హిందీ బిగ్ బాస్ సీజన్ 13 షురూ అయింది. బాలీవుడ్ కండలవీరుడు వరుసగా 10వ సారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మునుపటి సీజన్ల కంటే ఈసారి మరింత ఆసక్తికరంగా పలువురు బడా స్టార్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరందరిలో చెప్పుకోదగ్గ సెలెబ్రిటీస్ సిద్ధార్థ్ శుక్లా, రష్మీ దేశాయ్. వీరిద్దరూ పలు హిందీ సీరియల్స్‌తో బుల్లితెరపై అశేష ప్రేక్షకాదరణ పొందారు. అంతేకాక ఇరువురూ కూడా ఒకప్పుడూ లవ్ బర్డ్స్ అని బీ-టౌన్ టాక్ నడించింది. మధ్యలో […]

బిగ్ బాస్: బెడ్ షేరింగ్ టాస్క్‌.. కంటెస్టెంట్ల మధ్య చిచ్చు!
Follow us

|

Updated on: Sep 30, 2019 | 9:54 PM

హిందీ బిగ్ బాస్ సీజన్ 13 షురూ అయింది. బాలీవుడ్ కండలవీరుడు వరుసగా 10వ సారి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. మునుపటి సీజన్ల కంటే ఈసారి మరింత ఆసక్తికరంగా పలువురు బడా స్టార్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక వీరందరిలో చెప్పుకోదగ్గ సెలెబ్రిటీస్ సిద్ధార్థ్ శుక్లా, రష్మీ దేశాయ్. వీరిద్దరూ పలు హిందీ సీరియల్స్‌తో బుల్లితెరపై అశేష ప్రేక్షకాదరణ పొందారు. అంతేకాక ఇరువురూ కూడా ఒకప్పుడూ లవ్ బర్డ్స్ అని బీ-టౌన్ టాక్ నడించింది. మధ్యలో బ్రేకప్ కూడా జరిగింది.

ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ కంటెస్టెంట్లకు వచ్చీ రాగానే ‘బెడ్ ఫ్రెండ్స్ ఫరెవర్’ అనే టాస్క్‌తో ఇంటి సభ్యులను జంటలుగా విభజించి సీజన్ మొత్తం బెడ్‌ను షేర్ చేసుకునే విధంగా ప్లాన్ చేశాడు. ఇక దీనిని ఈ జంట వ్యతిరేకించడం గమనార్హం. ఎందుకు ఏమిటి అనేది తెలియదు గానీ.. పలు కారణాల వల్ల ఇద్దరూ బెడ్ షేర్ చేసుకోలేమని తెగేసి చెప్పేశారు. ఆ తర్వాత వీరిని బిగ్ బాస్ లివింగ్ రూమ్‌కి రమ్మని చెప్పాడు. ఇక ఏమి జరుగుతుందో ఏంటో ఈరోజు ఎపిసోడ్‌లో చూడాలి.

అటు ఈ బెడ్ షేరింగ్ టాస్కులు ప్రస్తుతం తెలుగులోకి రాలేదు గానీ.. మున్ముందు వస్తే మాత్రం ఖచ్చితంగా మరిన్ని కాంట్రవర్సీలకు బిగ్ బాస్ దారి తీస్తుందని చెప్పొచ్చు.

View this post on Instagram

#biggboss #biggboss13 #salmankhan #colourstv

A post shared by All reality shows updates (@mtvkhabhri2.0) on