Breaking News
  • మహబూబ్‌నగర్‌లో టెండర్‌ ఓటు నమోదు. 41వ వార్డులో 198వ పోలింగ్‌ కేంద్రంలో టెండర్‌ ఓటు నమోదు. ఘటనపై జిల్లా ఎన్నికల అధికారుల ఆగ్రహం. ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు. రీపోలింగ్‌ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం.
  • ల్యాండ్‌ పూలింగ్‌ సమయంలో చంద్రబాబు అనుచరులు భూములు కొన్నారు. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి-అంబటి. చట్టప్రకారం వాళ్లమీద యాక్షన్‌ తీసుకుంటాం-అంబటి. లోకేష్‌, చంద్రబాబు తాబేదారులు భూములు కొన్నారు-అంబటి.
  • కడప: ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్‌ బుకీల అరెస్ట్‌. రూ.2,68 లక్షలు స్వాధీనం.
  • ఏపీ హైకోర్టులో ఉత్కంఠ. సీఆర్‌డీఏ రద్దు, రాజధాని తరలింపు పిటిషన్ల కీలక విచారణ. వాదోపవాదాలు తెలుసుకోవటం కోసం వచ్చిన.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కేశినేని నాని. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న.. మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహిత్గి.
  • ఎవరైనా చట్టాలకు లోబడే పనిచేయాలి. మండలిలో జరిగేది ప్రజలకు తెలియకూడదనే ప్రసారాలు నిలిపేశారు. మండలిలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా చట్టం ప్రకారమే నడవాలి. మండలి చైర్మన్‌కు అధికార పార్టీ నేతలు నరకం చూపించారు. బిల్లును హడావుడిగా ఆమోదించుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న విజయసాయిరెడ్డికి కౌన్సిల్‌లో ఏం పని. -ఎమ్మెల్సీలు అశోక్‌బాబు, దీపక్‌, బచ్చులఅర్జునుడు, సత్యనారాయణరాజు.

బిగ్ బాస్: వాళ్ళిద్దరి ప్రేమకు సల్మాన్ విలన్ అయ్యాడా.?

Bigg Boss 13, బిగ్ బాస్: వాళ్ళిద్దరి ప్రేమకు సల్మాన్ విలన్ అయ్యాడా.?

ప్రతీ ఒక్కరి ప్రేమ కథలోనూ ఓ విలన్ ఉంటాడు. సరిగ్గా అలాగే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఓ జంట లవ్ స్టోరీకి సల్మాన్ ఖాన్ విలన్ అయ్యాడా.? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అవునంటున్నాయి. రష్మీ దేశాయ్, అర్హన్ ఖాన్ లవ్ స్టోరీ.. ఇప్పుడు నార్త్ ప్రేక్షకుల మధ్య ఇదే హాట్ టాపిక్. మొదట్లో హిందీ బిగ్ బాస్ పెద్దగా కిక్కివ్వలేదు గానీ.. ప్రస్తుతం ట్విస్టులు, సస్పెన్స్‌తో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రష్మీకి తన గతం గురించి చెప్పకుండా అర్హన్ ప్రపోజ్ చేసి నాటకాలు ఆడుతున్నాడని.. సల్మాన్ పెద్ద క్లాస్ పీకిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి అర్హన్ ఖాన్ అసలు రూపం బయటపడుతూ వస్తోంది.

రష్మీ దగ్గర ఒకలా.. వేరొకరి దగ్గర ఆమెను కించపరుస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు పరాస్ చాబ్రా, సిద్ధార్థ్ శుక్లాలను బిగ్ బాస్ సీక్రెట్ రూమ్‌కి పంపించాడు. ఇక వారిద్దరూ అక్కడి నుంచి మిగతా కంటెస్టెంట్లు ఏమనుకుంటున్నారో అన్ని విషయాలను గమనిస్తూ వచ్చారు.

ఇకపోతే రెండు రోజుల తర్వాత సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన పరాస్.. అర్హన్ నిజస్వరూపాన్ని రష్మీ దగ్గర బయటపెట్టడం జరిగింది. ఈ ఊహించని పరిణామానికి రష్మీ షాక్ అయ్యి కన్నీటి పర్యంతమైంది. అయితే ఆమె అర్హన్‌పై తన ప్రేమను వ్యక్తపరుస్తూ.. అతడు తన జీవితంలోకి వచ్చిన తర్వాతే తాను ఇప్పుడు ఈ స్థానంలో ఉండగలిగానని  స్పష్టం చేసింది.

Bigg Boss 13, బిగ్ బాస్: వాళ్ళిద్దరి ప్రేమకు సల్మాన్ విలన్ అయ్యాడా.?

ఇదిలా ఉంటే రీసెంట్‌గా రష్మీ, అర్హన్ ఖాన్ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుతున్నట్లు ఓ ప్రోమో బిగ్ బాస్ రిలీజ్ చేశాడు. హౌస్‌లో ఉన్న అందరూ కూడా తనకు వ్యతిరేకంగా ఉన్నారని.. అలాంటిది ఇప్పుడు నువ్వు కూడా నన్ను బాధపడితే.. నేను ఎలా టైటిల్ గెలుస్తానంటూ రష్మీ కన్నీరు పెట్టుకుంది. అయితే అర్హన్ మాత్రం ‘హౌస్‌లో ఎవ్వరూ నీకు తోడు లేకపోయినా.. తాను ఉన్నానంటూ హామీ ఇచ్చాడు’.

మరోవైపు అర్హన్ ఖాన్, షెఫాలీతో మాట్లాడిన దాని గురించి ప్రస్తావించిన రష్మీ.. అలా మాట్లాడి ఉండకూడని చెప్పుకొచ్చింది. అయితే అర్హన్ మాత్రం తన వైపు ఎటువంటి తప్పు లేదని రివర్స్‌లో ఆమెను తిట్టడం మొదలు పెట్టాడు. పరాస్ నా దగ్గర నీ గురించి చెప్పిన మాటల కంటే.. నువ్వు ఇప్పుడు ప్రవర్తించే తీరు నన్ను ఎంతో బాధపెడుతోందంటూ రష్మీ వాపోయింది.

ఏది ఏమైనా వీళ్లిద్దరి సీన్స్ ఫ్యాన్స్‌ను ఒక పక్క ఎమోషన్ కలిగిస్తుంటే.. మరో పక్క అర్హన్ తీరుకు కోపం కలిగిస్తోందని చెప్పాలి. కాగా, సల్మాన్ ఈ జంట ప్రేమకు ఎక్కడ ఫుల్‌స్టాప్ పెడతాడో వేచి చూడాలి.