Breaking News
  • భారత్-చైనా సరిహద్దుల్లోని డోక్లాంలో మళ్లీ అలజడి. 2 శక్తివంతమైన సర్వైలెన్స్ కెమేరాలను ఏర్పాటు చేసిన చైనా. వివాదాస్పద స్థలానికి దారితీసే రోడ్డు రిపేర్. 2017లో 73 రోజుల పాటు కొనసాగిన ఉద్రిక్తతలు. లద్దాఖ్ ఉద్రిక్తతల మళ్లీ కుట్రలు పన్నుతున్న చైనా.
  • రాజస్థాన్ సీఎం నివాసం సా. గం. 5.00కు సీఎల్పీ సమావేశం. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ నేపథ్యంలో భేటీ అవుతున్న సీఎల్పీ. సచిన్ పైలట్ వర్గంతో సయోధ్య అనంతరం తొలిసారి భేటీ.
  • అమరావతి: మాజీ మంత్రి అచ్చం నాయుడు కు కరోనా పాజిటివ్. కోర్టు ఆదేశాలతో గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు హైకోర్టుకు లేఖ రాసిన గుంటూరు రమేష్ హాస్పటల్. అచ్చెన్నాయుడు కు కరోనా పాజిటివ్ అని లేఖలో హైకోర్టు కు తెలిపిన రమేష్ హాస్పిటల్స్. రెండు రోజులుగా జలుబుతో బాధపడుతున్నఅచ్చెన్నాయుడు ఈ నేపథ్యంలోనే కరోనా టెస్ట్ చేసిన ఆస్పత్రి సిబ్బంది.
  • సీపీ హైదరాబాద్ అంజనీకుమార్. అంతర్జాతీయ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు. సైబర్ క్రైం లో రెండుకేసులు నమోదు అయ్యాయి. టెలిగ్రాం గ్రూప్ ద్వారా అడ్మిన్ సహాయంతో ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారు. వెబ్సైట్ ప్రతిరోజు మార్చుతారు. ఆసమాచారం గ్రూప్ లో తెలుసుకుంటారు. ఈ కంపెనీలో చైనా ఇండియా కు చెందిన న డైరక్టర్లు ఉన్నారు. వెయ్యి వందకోట్ల కేసులు ట్రాన్సెక్షన్ జరిగింది. పలు బ్యాంకు ఖాతాల్లో 30కోట్లు సీజ్ చేశాం. ఒక చైనీయునితో పాటు నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు . దర్యాప్తు సాగుతుంది. ఐటి శాఖకు సమాచారం ఇచ్చాం.
  • విజయవాడ : రమేష్ హాస్పిటల్ లీలలు. ఒక్కొక్కటిగా రమేష్ హాస్పిటల్ అక్రమాలు. నాలుగురోజుల గా పూర్తి ఆధారాలను సేకరించిన పోలీసులు. స్వర్ణ ప్యాలెస్ లో మే 18 న కోవిడ్ కేర్ సెంటర్ కు అనుమతి కోరిన రమేష్ హాస్పిటల్ యాజమాన్యం . కాని మే 15 నుంచే స్వర్ణ ప్యాలెస్ లో కోవిడ్ కేర్ సెంటర్ ను నిర్వహిస్తున్న రమేష్ హాస్పిటల్‌. నిబంధనలకు విరుద్ధంగా పలు ప్రాంతాలలో కోవిడ్ కేర్ సెంటర్లకు నిర్వహణ. స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదంతో బయటపడ్డ అక్రమాలు.
  • అమరావతి: ‘దిశ’ చట్టం అమలుపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్‌ సహా అధికారులు హాజరు.
  • విశాఖ: వెదర్ అప్ డేట్స్... వాయవ్య బంగాళాఖాతంలో నేడు ఏర్పడనున్న అల్పపీడనం. ఇది రెండు మూడు రోజుల పాటు కొనసాగుతూ ఉత్తర బంగాళాఖాతం మీద కేంద్రీకృతం అవుతుందని వాతావరణ శాఖ అంచనా. ఉత్తరాంధ్ర తీరం నుంచి ఒడిసా, బెంగాల్ వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణల్లో కురవనున్న ఉరుములతో కూడిన వర్షాలు . ఉత్తరాంధ్రలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు....ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం. కోస్తాంధ్రలో గంటకు 45-55 కిలో మీటర్ల వేగంతో వీస్తోన్న బలమైన గాలులు . మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం రాశిఖన్నా ఫస్ట్‌టైం ఏం చేసిందంటే..!

Raashi Khanna Dubs for Vijay's World Famous Lover Film, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ కోసం రాశిఖన్నా ఫస్ట్‌టైం ఏం చేసిందంటే..!

టాలీవుడ్‌లో.. యంగ్ హీరో విజయ్ దేవర కొండకు మంచి క్రేజ్ ఉంది. విజయ్ సినిమా వస్తుందంటే.. ఫ్యాన్స్‌కు పండగే. తాజాగా విజయ్ చేస్తోన్న సినిమా ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. టైటిల్‌తోనే.. బాగా క్రేజ్ తెచ్చుకున్న.. ఈ సినిమా పోస్టర్‌ అయితే.. బీభత్సంగా ఉంది. విడుదలైన కొద్ది క్షణాల్లో.. బాగా వైరల్ అయ్యింది. కాగా.. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్స్‌ నటిస్తున్నారు. రాశీఖన్నా మెయిన్ హీరోయిన్‌ కాగా.. కేథరిన్, ఐశ్వర్యా రాజేష్, ఎజిబెల్లాతో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. తాజాగా.. ఈ సినిమాకి రాశి ఖన్నా డబ్బింగ్ చెప్పింది.

‘నేను ఇప్పటిదాకా ఒక్క సినిమాకు కూడా డబ్బింగ్ చెప్పలేదు. నేను డబ్బింగ్ చెప్తోన్న మొదటి సినిమా ఇది. ఉచ్చరణ, నా వాయిస్ పాత్రకు నప్పుతాయో లేదోననే భయం ఉండేది. కానీ.. డబ్బింగ్ పూర్తి అయిన తరువాత నేనే నమ్మలేకపోయాను. మీరు ఎప్పుడెప్పుడు వింటారా అని ఎదురుచూస్తోన్నా’ అంటూ రాశి ట్వీట్ చేసింది. కాగా.. రాశి ఖన్నా టాలీవుడ్‌కి వచ్చి ఐదేళ్లయినా.. ఇప్పటికి ఒక్క సినిమాకి కూడా ఆమె సొంతంగా డబ్బింగ్ చెప్పలేదు. ‘జోరు’ సినిమాలో మాత్రం ఓ పాట పాడింది. అయితే.. ఈ సినిమాకు రాశిఖన్నా డబ్బింగ్‌ చెప్పిందట. దానికి సంబంధించిన ఓ పిక్‌ను ఆమెనే ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Related Tags