Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

సీన్ రివర్స్.. కొండెక్కుతున్న నీరు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

Water Flowing Upwards, సీన్ రివర్స్.. కొండెక్కుతున్న నీరు.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!

సాధారణంగా నీరు ఎత్తు నుంచి కిందకు ప్రవహిస్తూ ఉండటం సహజం. కొండల మధ్య నుంచి నీరు కిందకు జారుతుండటం.. అలా సముద్రంలోకి కలిసిపోవడం అందరూ చూసే దృశ్యమే. కానీ ఇక్కడ వింతేంటంటే సీన్ రివర్స్ అయ్యి.. నీరు కింద నుంచి కొండపైకి గాలి మాదిరిగా ఊగుతూ ప్రవహిస్తోంది. ఇలాంటి అరుదైన సంఘటనను ఎప్పుడైనా చూశారా. ఈ సుందర దృశ్యం డెన్‌మార్క్‌లోని ఫారో ఐలాండ్స్‌లో వీక్షకులను కనువిందు చేస్తుంది.

సముద్రం నుంచి నీరు ఎత్తైన కొండపైకి ప్రవహిస్తూ.. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక జాకొబ్సేన్‌ అనే వ్యక్తి జనవరి 6న దీన్ని తన కెమెరాలో బంధించి ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా దానికి వేలల్లో లైకులు, షేర్లు రావడం విశేషం. కాగా, ఇలా జరగడం వెనుక ఒక రహస్యం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

టోర్నడోలు ఏర్పడే సమయంలో ఒక్కోసారి ఒత్తిడికి గురైన గాలి.. భూమిపై ఉన్న చెత్త చెదారాన్ని ఒక వలయాకారంగా చేసుకుని పెను విధ్వంసానికి దారి తీస్తుంది. అలాంటి సమయంలో నీరు కూడా చాలా వేగంగా కదులుతుందని.. ఇలాంటి టోర్నడోల ఫలితంగా నీరు కూడా మేఘాలను తాకే ఎత్తుకు చేరుకుంటుందని వారు అంటున్నారు. ఇక ఇలాంటి దృశ్యం కూడా దానికి ప్రతిరూపమేనని నిపుణులు స్పష్టం చేశారు.