కాజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన ‘గోల్డెన్ టైగర్’..!

ఓవైపు దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన గోల్డెన్ టైగర్‌‌(బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు గుర్తించారు.

కాజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన ‘గోల్డెన్ టైగర్’..!
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 5:11 AM

ఓవైపు దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. తెలుగు రాష్టాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. మరోవైపు అస్సాంలోని కాజిరంగా నేషనల్ పార్క్‌లో అరుదైన గోల్డెన్ టైగర్‌‌(బంగారు వర్ణపు పులి) సంచరిస్తున్నట్లు గుర్తించారు. వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ మయూరేశ్ హెంద్రే ఈ పులి కదలికలను తన కెమెరాలో బంధించారు. ఈ సందర్భంగా హెంద్రే మాట్లాడుతూ, గోల్డెన్ టైగర్స్ చాలా అరుదుగా ఉంటాయని చెప్పారు. ‘అయితే విస్తృతమైన సంతానోత్పత్తి కారణంగా పులుల్లో జన్యులోపం ఏర్పడుతుందని కొందరు చెబుతారు. దానివల్లే పులులు ఈ రంగులోకి మారతాయని వారి అభిప్రాయం’ అని హెంద్రే పేర్కొన్నారు.

[svt-event date=”13/07/2020,12:03AM” class=”svt-cd-green” ]

[/svt-event]

Also Read: ఫలించిన చర్చలు.. స్వదేశానికి 367 మంది భారతీయులు..!