విరబూసిన బ్రహ్మ కమలాలు, అరుదైన దృశ్యాలు

ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో అరుదైన బ్రహ్మకమలాలు విరబూసి ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. కేవలం సూర్యాస్తమయం తరువాతే వికసించే ఈ పుష్పాలు ఇంటర్నెట్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. 8 అంగుళాల వైశాల్యంతో..విరబూయడానికి రెండు గంటలు తీసుకునే ఈ పుష్పాలు కొన్ని గంటలు మాత్రమే విరబూసి ఆ తరువాత ముడుచుకుపోతాయి. విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు వీటిని ప్రత్యేకంగా క్రియేట్ చేసినట్టు చెబుతారు. ఇవి అదృష్టాన్ని తెచ్చి పెడతాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కేదార్ నాథ్, బదరీనాథ్ సహా పలు పుణ్య […]

విరబూసిన బ్రహ్మ కమలాలు, అరుదైన దృశ్యాలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 10, 2020 | 4:10 PM

ఉత్తరాఖండ్ లోని ఛమోలీ జిల్లాలో అరుదైన బ్రహ్మకమలాలు విరబూసి ఆశ్చర్యచకితులను చేస్తున్నాయి. కేవలం సూర్యాస్తమయం తరువాతే వికసించే ఈ పుష్పాలు ఇంటర్నెట్ ను మెస్మరైజ్ చేస్తున్నాయి. 8 అంగుళాల వైశాల్యంతో..విరబూయడానికి రెండు గంటలు తీసుకునే ఈ పుష్పాలు కొన్ని గంటలు మాత్రమే విరబూసి ఆ తరువాత ముడుచుకుపోతాయి. విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మదేవుడు వీటిని ప్రత్యేకంగా క్రియేట్ చేసినట్టు చెబుతారు. ఇవి అదృష్టాన్ని తెచ్చి పెడతాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది. కేదార్ నాథ్, బదరీనాథ్ సహా పలు పుణ్య క్షేత్రాల్లో నిర్వహించే దైవ కార్యాల్లో వీటిని వినియోగిస్తారు. టిబెట్ లో తయారు చేసే మందుల్లోను, ఇతర  ఆయుర్వేద మందుల్లోనూ కూడా బ్రహ్మ కమలాలను వాడుతారట. వీటిని చూస్తేనే లక్ అనేవాళ్ళూ ఉన్నారు.