బిగ్ బ్రేకింగ్: విశ్వాస పరీక్షకు ముందు ‘మహా’ డ్రామా?

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అర్ధరాత్రి మొదలైన కార్యాచరణకు ఉదయాన్నే ప్రమాణ స్వీకారంతో ముగింపునిచ్చిన బిజెపి.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోలుకోలేని షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో శివసేన, కాంగ్రెస్ పార్టీలు షాక్‌కు గురి కాగా.. ఎన్సీపీది నాటకమో.. లేక చీలికో అంతుచిక్కని పరిస్థితి. అయితే బలపరీక్షకు గవర్నర్ వారం రోజుల సమయం ఇవ్వగా.. నాలుగు ప్రధాన పార్టీలు బిజెపి, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అమీతుమీ తేల్చుకునేందుకు కొత్త రాజకీయానికి తెరలేపాయి. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ […]

బిగ్ బ్రేకింగ్: విశ్వాస పరీక్షకు ముందు ‘మహా’ డ్రామా?
Follow us

| Edited By: Srinu

Updated on: Nov 23, 2019 | 3:56 PM

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అర్ధరాత్రి మొదలైన కార్యాచరణకు ఉదయాన్నే ప్రమాణ స్వీకారంతో ముగింపునిచ్చిన బిజెపి.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలకు కోలుకోలేని షాకిచ్చింది. అనూహ్య పరిణామంతో శివసేన, కాంగ్రెస్ పార్టీలు షాక్‌కు గురి కాగా.. ఎన్సీపీది నాటకమో.. లేక చీలికో అంతుచిక్కని పరిస్థితి. అయితే బలపరీక్షకు గవర్నర్ వారం రోజుల సమయం ఇవ్వగా.. నాలుగు ప్రధాన పార్టీలు బిజెపి, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు అమీతుమీ తేల్చుకునేందుకు కొత్త రాజకీయానికి తెరలేపాయి.

దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్‌లిద్దరు తాము బలపరీక్షలో నెగ్గుతామని ప్రకటించగా.. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ పార్టీల నేతలు బిజెపివి నీచ రాజకీయాలంటూ ఘాటు విమర్శలకు దిగారు. అజిత్ పవార్‌ను ఎల్పీ లీడర్‌ పదవి నుంచి తప్పించారు శరద్ పవార్. ఎన్సీపీ ఎమ్మెల్యేలెవరు అజిత్ వెంట వెళ్ళరని శరద్ పవార్ చెబుతున్నారు. మరోవైపు శివసేనలో 19 మంది ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారారని ప్రచారం జరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం బిజెపి (105) ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం (22) శివసేన చీలిక వర్గం (19) ఇండిపెండెంట్లు (8) కలిసి.. 154 మంది సపోర్టు తమకుందని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

ఎన్సీపీ అధినేత లెక్కలు మరోలా వున్నాయి. ఏదో అత్యవసర సమావేశం అంటే తమ ఎమ్మెల్యేలు 11 మంది అజిత్ పవార్‌తో వెళ్ళారని, వారిలో ముగ్గురు తిరిగి తమ క్యాంపులోకి వచ్చేశారని శరద్ పవార్ ప్రకటించారు. శివసేన మాత్రం తమ పార్టీ ఎమ్మెల్యేల్లో ఒక్కరు కూడా బిజెపితో వెళ్ళడం లేదని గట్టిగా వాదిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ఎమ్మెల్యేలకు గిరాకీ పెద్ద స్థాయిలో పెరిగిపోయింది.

క్యాంపులకు ఎమ్మెల్యేలు..

బల పరీక్షకు వారం రోజుల వ్యవధి వుండడంతో ప్రధాన పార్టీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పని ప్రారంభించాయి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లకు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్) ఎమ్మెల్యేలను తరలించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. అటు బిజెపి తమ ఎమ్మెల్యేలను కాపాడుకుంటూనే ఇండిపెండెంట్లను, శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలకు గాలమేయడం ముమ్మరం చేసినట్లు సమాచారం.

మొత్తమ్మీద ఈ వారం రోజుల డ్రామా తర్వాత ఎవరు నిజమైన విజేతలో.. ఎవరు పరాజితులో తేలిపోనుంది. అదేసమయంలో మహారాష్ట్ర పాలిటికల్ పిక్చర్‌లో మిగిలేదెవరో కూడా ఖరారు కానుంది.

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?